Telugu News » Supreme Court: రామ్‌దేవ్‌ బాబాకు సుప్రీంకోర్టు చురకలు..!

Supreme Court: రామ్‌దేవ్‌ బాబాకు సుప్రీంకోర్టు చురకలు..!

కోర్టు పట్ల తమకు అత్యంత గౌరవం ఉందని, తమ తప్పులు పునరావృతం కాబోవని పేర్కొన్నారు. అయితే యోగాగురు సంజీయిషీని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

by Mano
Supreme Court: Ramdev Baba's Supreme Court hurrakulu..!

పతంజలి(Pathanjali) తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో(PTI)పై సుప్రీంకోర్టు(Supreme Court) మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా యోగాగురు రాందేవ్(Yoga guru Ram dev) పతంజలి ఆయుర్వేద్, 67 వార్తాపత్రికల్లో క్షమాపణలు ప్రచురించామని, కోర్టు పట్ల తమకు అత్యంత గౌరవం ఉందని, తమ తప్పులు పునరావృతం కాబోవని పేర్కొన్నారు. అయితే యోగాగురు సంజీయిషీని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

Supreme Court: Ramdev Baba's Supreme Court hurrakulu..!

పతంజలి వార్తాపత్రికల్లో పెట్టిన క్షమాపణ పరిమాణం దాని ఉత్పత్తులకు సంబంధించిన పూర్తి పేజీ ప్రకటనలను పోలి ఉందా? అని ప్రశ్నించింది. అల్లోపతిని, వైద్యులను చులకన చేసే ప్రకటనలు చేస్తోందని పతంజలిపై 2022, ఆగస్టులో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం గతేడాది నవంబర్ 21న పతంజలిని హెచ్చరించింది.

అయినప్పటికీ తీరు మార్చుకోకపోవడంతో ఫిబ్రవరి 27న పతంజలి ప్రకటనలపై నిషేధం విధించింది. అయితే ఈ కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు విచారణకు ముందు వారం రోజుల తర్వాత ఎందుకు క్షమాపణలు చెప్పారని జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. ఇతర ఎఫ్ఎంసీజీలు కూడా తప్పుదోవ పట్టించే ప్రకటనలను ప్రచురిస్తున్నాయని చురకలంటించింది. ఇది ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని అని జస్టిస్ హిమా కోహ్లి అన్నారు.

డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యలను పరిశీలించాలని ఈ కేసులో వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖను అభ్యర్థించాల్సిన అవసరం ఉందని కోర్టు ఆదేశించింది. కాగా, గతంలో రామవ్ బాబా, ఎండీ బాలకృష్ణ క్షమాపణలు పరిశీలిస్తామని వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణలు చెబుతూ ప్రకటనలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే మంగళవారం ఆ కేసుపై విచారణ జరిపింది.

You may also like

Leave a Comment