Telugu News » ARTOS A ‘Devil drink’ ఈ ‘దెయ్యం సోడా’ను…వందేళ్లకు పైగా తాగుతున్నారు…అంత ఫేమస్

ARTOS A ‘Devil drink’ ఈ ‘దెయ్యం సోడా’ను…వందేళ్లకు పైగా తాగుతున్నారు…అంత ఫేమస్

ఈ సోడాలోంచి వచ్చే గ్యాస్ ని చూసి అందులో దెయ్యం ఉందని జనాలు భయపడిపోయేవారు. ఆ సోడాలో దెయ్యం ఉందని తాగొద్దంటూ ఒకరికి ఒకరు చెప్పుకునేవారు.

by Prasanna
11111

స్టార్ హీరోలు ప్రమోట్ చేసే కూల్ డ్రింక్స్ థమ్స్ అప్, పెప్సీ, కోకాకోలా వంటి ఇంటర్నేషనల్ బ్రాండింగ్ డ్రింక్స్ కి పోటీ ఇచ్చే ఒక లోకల్ డ్రింక్ (Local Drink) ఉందని మీకు తెలుసా? అది కూడా గోదావరి జిల్లాల డ్రింక్. ఈ డ్రింక్ తాగిన వారేవ్వరైనా వాహ్…ఆర్టోస్ (ARTos) అనాల్సిందే. అర్టోస్ అంటే ఏమనుకుంటున్నారా…అదే ఈ డ్రింక్ పేరు.

11111

ఆర్టోస్ కథ ఇది…

బ్రిటిష్ కాలంలోనే ఈ ఆర్టోస్ (ARTos) డ్రింక్ ని తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) వాసైన అడ్డూరి రామచంద్రరాజు తయారు చేశారు. ఈ డ్రింక్ తయారీ ఆలోచన ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే 112 ఏళ్ల వెనక్కి వెళ్లాలి. 1912లో రామచంద్రపురానికి చెందిన రామచంద్రరాజు ఒక పని మీద కాకినాడ కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. అక్కడ వృధాగా పడి ఉన్న ఒక గోలీసోడా (Golisoda) మిషన్ ఆయన కంటపడింది. దాంతో ఆయనకు ఏదో ఒక ఆలోచన వచ్చింది. వెంటనే దానిని కొనుగోలు చేసి రామచంద్రపురం పట్టుకొచ్చేశారు. ఆ రోజుల్లోనే ఇంగ్లాడ్ నుంచి మరికొన్ని పరికరాలను తెప్పించి…వాటిని ఈ పాత గోలీసోడా మిషన్ కు బిగించి…సరికొత్తగా తయారు చేశారు.

బాబోయ్ దెయ్యం సోడా…

ఈ ఆర్టోస్‌ డ్రింక్ ను చూసి తొలి రోజుల్లో స్థానిక ప్రజలు భయపడిపోయేవారు. అంతేకాదు, దీనికి దెయ్యం సోడా అని పేరు కూడా పెట్టారు. ఆ సమయంలో ఆర్టోస్ డ్రింక్ సేల్స్ పడిపోయాయి. గోలీసోడా అంటే ఇంకా పెద్దగా జనాల్లోకి వెళ్లని ఆ రోజుల్లో రామచంద్రపురం పరిసర ప్రాంతాల్లో ఆర్టోస్ డ్రింక్ అమ్మకాలు జరుగుతుండేవి. ఈ సోడాలోంచి వచ్చే గ్యాస్ ని చూసి అందులో దెయ్యం ఉందని జనాలు భయపడిపోయేవారు. ఆ సోడాలో దెయ్యం ఉందని తాగొద్దంటూ ఒకరికి ఒకరు చెప్పుకునేవారు.

గోదావరి సోడాకు ప్రచారం చేసిన బ్రిటిష్ సైనికులు…

రామచంద్రాపురం చట్టూ పక్కల ప్రాంతాలకు బ్రిటిష్ సైన్యం, అధికారులు ఎక్కువగా వస్తుండేవారు. అక్కడ బ్రిటీష్ సైనికులు. అధికారులకు స్థానిక దుకాణదారులు గోళిసోడాను ఇచ్చేవారు. ఆ టేస్ట్ చూసిన బ్రిటిష్ వారు ఆర్టోస్ డ్రింక్స్ కు ఫిదా అయిపోయారు. బ్రిటిష్ సైనికులు ఎక్కువగా తాగుతుండటంతో స్థానికులు కూడా ఆ డ్రింక్ ను తాగేందుకు ముందుకు వచ్చేశారు. దాంతో క్రమంగా ఆర్టోస్ అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇక మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోనవసరం లేకపోయింది.

ఎవరైనా గోదారి వస్తే ఆర్టోస్ తాగాల్సిందే…

మన దేశంలో కూల్ డ్రింక్స్ లో ఎన్ని బ్రాండ్ లున్నా, ఎవరు ఏది తాగినా…గోదావరి జిల్లాలకు వస్తే మాత్రం ఆర్టోస్‌ తాగాల్సిందే. ఇక్కడ ఏ పెళ్లైనా, పేరంటమైనా…స్నేహితులు వచ్చినా ఆర్టోస్ డ్రింకే ఇస్తారు. నిజానికి ఇది తాగుతుంటే…ద్రాక్ష పళ్ల రసం తాగినట్లు ఉంటుంది. అందుకే ఒకసారి తాగిన వారేవరైనా మళ్లీ దీనిని అడుగుతారు.

మద్రాస్ డ్రింక్ టెస్ట్…రామచంద్రపురంలో

1912లో రామచంద్రపురంలో తయారీ మొదలై అమ్మకాలు జరుపుకుంటున్న ఆర్టోస్ డ్రింక్ అసలు పేరు ఏఆర్ రాజు డ్రింక్స్. 1919 వరకు నిజానికి ఈ డ్రింక్ కు ఏ పేరు ఉండేది కాదు, ద్రాక్ష జ్యూస్ రంగులో ఉండే ఈ జ్యూస్ ను స్థానికులు రామచంద్రపురం రాజుగారి డ్రింక్ అని పిలిచేవారు. ఆ తర్వాత అంటే 1919లో రామచంద్రరాజు తమ్ముడు జగన్నాథరాజు మద్రాసులో చదువు పూర్తి చేసుకుని సొంతూరు వచ్చారు. తాను మద్రాసులో రుచి చూసినలాంటి ఒక  కూల్ డ్రింక్ ను తయారు చేయాలని అనుకున్నారు. దానికి అడ్డూరి రామచంద్రరాజు టానిక్స్ (AR Drinks) అని పేరు పెట్టారు.

మూడు పైసల డ్రింక్…

లండన్, జర్మనీల నుంచి ముడిసరుకు తెప్పించి 1919లోనే ఏఆర్‌ రాజు డ్రింక్స్ పేరుతో సాఫ్ట్‌ డ్రింక్‌ తయారీ ప్రారంభించారు. డ్రింకుకు తయారు చేసే వాటిలో ఒక్క నీరు తప్ప మిగిలిన ముడి సరకులన్నీ విదేశాల నుంచే దిగుమతి చేసుకునే వారు. ఈ డ్రింకులను అప్పట్లో రామచంద్రపురం నుంచి తోపుడు బండ్లు, ఎడ్ల బండ్ల ద్వారా రాజమండ్రి వరకూ తీసుకుని వచ్చి అర్ధణా నుంచి మూడు పైసలకు అమ్మేవారు. ఆ తర్వాత దీని పేరును ఏఆర్ టానిక్స్ గా మార్చారు. 1955 నాటికి పూర్తి ఆటోమెటిక్‌ గా డ్రింక్స్ తయారు చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత AR Tonics డ్రింక్ కే ‘ఆర్టోస్‌’ ARTosగా పేరు పెట్టారు. ఆ సంవత్సరంలోనే ‘ఆర్టోస్’ పేటెంట్ హక్కులు కూడా పొందారు.

113 ఏళ్లలో మారనిది రుచి మాత్రమే…

1912 నుంచి ఇప్పటి వరకూ సుమారు ఆరుసార్లు డ్రింక్‌ పలు రకాలుగా మారుతు వచ్చింది. అంటే దీని తయారీ, ఇతర ప్లేవర్స్, సీసాల ఆకారం వంటివి మారుతూ వచ్చాయి. కానీ టేస్ట్ మాత్రం మారలేదు. తూర్పుగోదావరి జిల్లాతో పాటు పక్కనే ఉన్న మరో గోదావరి జిల్లా అయిన పశ్చిమ గోదావరి జిల్లాకు, ఉత్తరాంధ్రాలోని విశాఖపట్నం జిల్లాకు కూడా ఈ ఆర్టోస్‌ డ్రింక్‌ను పంపిణీ చేస్తుంటారు. ఈ కంపెనీకి మూడు జిల్లాల్లోనూ 100 మందికి పైగా డీలర్లు ఉన్నారు.

You may also like

Leave a Comment