Telugu News » Panneer Selvam: తమిళనాడు మాజీ సీఎం కు షాకిచ్చిన కోర్టు!

Panneer Selvam: తమిళనాడు మాజీ సీఎం కు షాకిచ్చిన కోర్టు!

సరైన ఆధారాలు లభించలేదంటూ ఏసీబీ అధికారులు కోర్టుకు నివేదికను అందించారు

by Sai
madras high court reopens panneerselvam corruption case

మద్రాస్‌ హైకోర్టు(Madras high court) తమిళనాడు మాజీ సీఎం పన్నీర్‌ సెల్వానికి (Panneer Selvam) షాకిచ్చింది. అక్రమ సంపాదన కేసు పునర్విచారణను సుమోటోగా(sumato) స్వీకరించింది. ఈ కేసులో దిగువ కోర్టు పన్నీర్‌ సెల్వానికి కొంత విముక్తినిచ్చింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రభుత్వంలో పన్నీర్‌ రెవెన్యూ మంత్రిగా పని చేశారు.

madras high court reopens panneerselvam corruption case

మంత్రిగా ఉన్న సమయంలో ఆయన 1.77 కోట్ల మేర అక్రమంగా సంపాదించారంటూ 2006లో అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వం ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో పన్నీర్ తో పాటు ఆయన భార్య విజయలక్ష్మి, కుమారుడు రవీంద్రనాథ్ లతో పాటు ఆరుగురిపై ఛార్జిషీట్లు దాఖలయ్యాయి.

2011లో అన్నాడీఎంకే మళ్లీ అధికారంలోకి రాగానే అక్రమార్జన కేసుపై విచారణ జరిపేందుకు అనుమతిని వెనక్కి తీసుకుంది. ఇదే సమయంలో నిందితులపై ఆరోపణలు రుజువు చేసేందుకు సరైన ఆధారాలు లభించలేదంటూ ఏసీబీ అధికారులు కోర్టుకు నివేదికను అందించారు. దీంతో, శివగంగ కోర్టు 2012లో వీరందరినీ నిర్దోషులుగా ప్రకటించింది.

ఈ తీర్పు వెలువడిన 11 ఏళ్ల తర్వాత సుమోటోగా కేసుపై పునర్విచారణ జరపాలని మద్రాస్ హైకోర్టు జడ్జ్ జస్టిస్ ఆనంద్ వెంకటేశ్ నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలకు వ్యతిరేకంగా కేసులు నమోదు చేయడం, ఆ తర్వాత ప్రతిపక్షాలు అధికారంలోకి రాగానే కేసులను రద్దు చేయడం వంటివి పరిపాటిగా మారాయని జస్టిస్ ఆనంద్ అన్నారు.

ఏసీబీ అధికారుల వైఖరి కూడా అధికార పక్షాలకు అనుకూలంగా ఉంటోందని విమర్శించారు. దిగువ కోర్టుల తీర్పుపై 12 ఏళ్లు గడిచినా పునర్విచారణ జరిపేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింద

You may also like

Leave a Comment