కర్ణాటక(Karnataka)కు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ (Arun Yogi Raj) రూపొందించిన రామ్ లల్లా (Ram Lalla) విగ్రహాన్ని జనవరి 22న అయోధ్య రామమందిరంలో ప్రతిష్ఠించనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ధృవీకరించింది.
ఈ విగ్రహాన్ని కృష్ణ శిలపై అరున్ యోగిరాజ్ అద్బుతంగా చెక్కారు. ఈ రాతి శిల్పం ఐదేండ్ల రామ్ లల్లా గురించి అద్బుతంగా వర్ణిస్తుంది. ఈ విగ్రహం 150 కిలోల నుండి 200 కిలోల బరువు ఉంటుంది. ఈ విగ్రహాన్ని జనవరి 17న కొత్త ఆలయంలోకి తరలించనున్నట్టు ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు.
ప్రస్తుతం ఉన్న రామ్ లల్లా విగ్రహాన్ని కూడా కొత్త ఆలయం గర్భగుడిలో ఉంచుతామని రాయ్ ప్రకటించారు. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం యోగి రాజ్ శిల్పాన్ని ఎంపిక చేసిన విషయాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గతంలోనే ప్రకటించారు.
అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టాపన కోసం విగ్రహాన్ని ఎంపిక చేశారని తెలిపారు. ప్రఖ్యాత శిల్పి యోగిరాజ్ అరుణ్ చెక్కిన శ్రీరాముడి విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్టించనున్నట్టు ట్వీట్ చేశారు. ఇక రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టకు మరో వారం రోజులే మిగిలి వుంది. దీంతో కార్యక్రమ ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి.