Telugu News » Arvind Kejriwal Ed Enquiry: ఈడీ విచారణకు సిద్ధమైన కేజ్రీవాల్.. కానీ ఓ షరతు..!!

Arvind Kejriwal Ed Enquiry: ఈడీ విచారణకు సిద్ధమైన కేజ్రీవాల్.. కానీ ఓ షరతు..!!

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) ఎట్టకేలకు విచారణకు హాజరయ్యేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ మేరకు తాజా సమన్లకు ఇచ్చిన సమాధానంలో సీఎం పేర్కొన్నట్లు ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు సోమవారం వెల్లడించాయి.

by Mano
Arvind Kejriwal Ed Enquiry: Kejriwal ready for ED enquiry.. But one condition..!!

మద్యం కుంభకోణం కేసు(Liquor scam case)లో గత కొంతకాలంగా ఈడీ సమన్లను తిరస్కరిస్తూ వస్తోన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) ఎట్టకేలకు విచారణకు హాజరయ్యేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ మేరకు తాజా సమన్లకు ఇచ్చిన సమాధానంలో సీఎం పేర్కొన్నట్లు ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు సోమవారం వెల్లడించాయి.

Arvind Kejriwal Ed Enquiry: Kejriwal ready for ED enquiry.. But one condition..!!

అయితే, మార్చి 12 తర్వాతే తాను దర్యాప్తు సంస్థ ఎదుట హాజరవుతారని ప్రభుత్వ వర్గం వెల్లడించింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణ కోసం మార్చి 4న రావాలని ఇటీవల కేజ్రీవాల్‌కు ఈడీ ఎనిమిదోసారి సమన్లు జారీ చేసింది. ఈసారీ గైర్హాజరైన కేజ్రీవాల్ ఈడీకి తన సమాధానం పంపారు. దర్యాప్తు సంస్థ సమన్లు చట్ట విరుద్ధమని మరోసారి ఆరోపించారు.

మరోవైపు, కేజ్రీవాల్పై బీజేపీ విమర్శలు ఈడీకి సమన్లకు కేజ్రీవాల్ సమాధానం ఇవ్వడంపై బీజేపీ స్పందించింది. కేజ్రీవాల్ ఈడీ సమన్లు జారీ చేసినా సాకులూ చెబుతూ వచ్చారని ఆరోపించింది. ఆయన ప్రతీకార రాజకీయం అంటూ దయ్యబట్టారు. అలా అయితే కోర్టు ఎందుకు ఈ కేసుపై స్టే ఇవ్వలేదంటూ బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ప్రశ్నించారు.

కాగా, మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే సీబీఐ కేజ్రీవాల్‌ను విచారించింది. గతేడాది ఏప్రిల్‌లో 9 గంటల పాటు ప్రశ్నించింది. తాజాగా ఈడీ నమోదు చేసిన కేసులోనూ వరుసగా సమన్లు అందుతున్నాయి. ఇక ఇదే కేసులో దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా, ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ జైల్లో ఉన్నారు.

You may also like

Leave a Comment