మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఆ పిటిషన్‌ను తిరస్కరించడంతో పాటు పిటిషనర్‌కు జరిమానా విధించింది.
అన్ని క్రిమినల్ కేసుల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజీవాల్ మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో కేజ్రీవాల్ తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టి హైకోర్టు అట్టి పిటిషన్‌ను తరస్కరించడంతో పాటు పిటిషనర్‌కు రూ.75వేల జరిమానా విధించింది.
ఢిల్లీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తిపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులో కోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేయదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌పై తీర్పు అసాధారణమైనదని వ్యాఖ్యానించింది. జ్యుడిషియల్ ఆర్డర్ ఆధారంగా ఎవరైనా కస్టడీలో ఉంటారని కోర్టు తెలిపింది.
మరోవైపు ఢిల్లీ మంత్రి అతిషి మరోసారి బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్‌ను ఎయిమ్స్ వైద్యుడికి చూపించామని బీజేపీ ఈడీ, జైలు అధికారులతో కోర్టులో చెప్పించిందని మండిపడ్డారు. అయితే అది పూర్తిగా అవాస్తవమని కోర్టులో హాజరుపరిచే వరకూ ఏ వైద్య నిపుణుడికీ ఆయన్ను అధికారులు చూపించలేదని ఆరోపించారు. మార్చి 21న ఈ కేసులో ఈడీ కేజ్రివాల్‌ను అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో తీహార్ జైలులో ఉన్నాడు.