Telugu News » Manushi Chillar: ఆ హీరో అంటే నాకెంతో ఇష్టం.. మాజీ ప్రపంచ సుందరి..!

Manushi Chillar: ఆ హీరో అంటే నాకెంతో ఇష్టం.. మాజీ ప్రపంచ సుందరి..!

'ఆపరేషన్ వాలెంటైన్' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని తెలిపింది. తానకు రామ్‌చరణ్‌(Ram Charan) అంటే ఎంతో ఇష్టమని తెలిపింది.

by Mano
Manushi Chillar: I like that hero a lot.. Former Miss World..!

మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్(Manushi Chillar) బాలీవుడ్‌(Bollywood)లో వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. ఇటీవల వరుణ్ తేజ్‌తో ‘ఆపరేషన్ వాలెంటైన్’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని తెలిపింది. తానకు రామ్‌చరణ్‌(Ram Charan) అంటే ఎంతో ఇష్టమని తెలిపింది.

Manushi Chillar: I like that hero a lot.. Former Miss World..!

అతడి డ్యాన్స్ అద్భుతంగా ఉంటుందని, ఎప్పటి నుంచో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పింది. తన తదుపరి సినిమా తెలుగులో చరణ్‌తోనే ఉండాలని భావిస్తున్నట్లు తెలిపింది. కాగా బాలీవుడ్‌లో ‘బడే మియా చోటే మియా’లో మానుషి చిల్లర్ నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో ఆమె పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. తనకంటే 30ఏళ్లు పెద్దవాడైన అక్షయ్ కుమార్‌తో నటించడంపై మానుషి స్పందించింది.

స్టార్ హీరోలతో కలిసి నటించడానికి తనకేం అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. ఎందుకంటే స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు ఎక్కువ మంది ప్రేక్షకుల దృష్టిని ఆకర్శించవచ్చు అని అంటూ తెలిపింది. అలాంటి స్టార్స్‌తో చాలా మంది నటించాలని అనుకుటారని ఆ అవకాశం తనకు రావడంతో ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశానని తెలిపింది. అయితే ఎవరిని తీసుకోవాలనేది పూర్తిగా దర్శకుల నిర్ణయం కాబట్టి దాని గురించి తాను పెద్దగా మాట్లాడాలనుకోవడం లేదని చెప్పింది.

అగ్ర నటులతోనే కాకుండా యువ హీరోల చిత్రాల్లోనూ నటించాలనుకుంటున్నానని మానుషి చిల్లర్ స్పష్టం చేసింది. ఈ హీరోయిన్ 2017లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘సామ్రాట్ పృథ్వీరాజ్‌తో వెండితెరకు పరిచయమైంది. తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది. కబీర్ సింగ్ డైరెక్టర్ సందీప్ వంగ తొలుగా ఆ సినిమాలో హీరోయిన్‌గా ఈ బ్యూటీనే సంప్రదించాడట. అయితే అనివార్య కారణాల వల్ల వదులుకోవాల్సివచ్చిందని తెలిపింది.

 

You may also like

Leave a Comment