Telugu News » Arvind Kejriwal : వెనక్కు తగ్గని ఈడీ.. ఢిల్లీ సీఎం సన్నిహితుల ఇళ్లపై దాడులు..!

Arvind Kejriwal : వెనక్కు తగ్గని ఈడీ.. ఢిల్లీ సీఎం సన్నిహితుల ఇళ్లపై దాడులు..!

ఢిల్లీ కేబినెట్‌ మంత్రి అతిషి.. ఈడీకి సంబంధించి కీలక విషయాన్ని వెల్లడించనున్నట్లు పేర్కొన్న మరుసటిరోజే ఈ సోదాలు జరగటంతో ప్రాధాన్యం సంతరించుకొంది.

by Venu
Arvind Kejriwal: CM is not counting us.. ED complaint in court..!

లిక్కర్ స్కామ్ (Liquor Scam) కేసులో ఈడీ దూకుడు పెంచింది. పలుసార్లు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్​ కన్వీనర్​ అరవింద్ కేజ్రీవాల్​ (Arvind Kejriwal)ను విచారణకు హాజరు కావాలని కోరిన, ఆయన స్పందించ పోవడంతో, కేజ్రీవాల్‌పై న్యాయస్థానంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) ఇప్పటికే ఫిర్యాదు చేసింది. మరోవైపు ఈ కేసును సీరియస్ గా తీసుకొన్న ఈడీ.. కేజ్రీవాల్​ సన్నిహితుల ఇళ్లపై దాడులు మొదలు పెట్టింది.

Arvind Kejriwal: CM is not counting us.. ED complaint in court..!

నేటి ఉదయం కేజ్రీవాల్​ వ్యక్తిగత కార్యదర్శి వైభవ్​ కుమార్​ సహా ఆప్​తో సంబంధం ఉన్న పలువురి ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించింది. సుమారు 10 ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. సీఎం వ్యక్తిగత కార్యదర్శి వైభవ్‌ కుమార్‌, ఢిల్లీ జలబోర్డు మాజీ సభ్యుడు శలభ్‌కుమార్‌, ఆప్‌ రాజ్యసభ ఎంపీ, జాతీయ కోశాధికారి N.D.గుప్తా కార్యాలయంతో పాటు మరికొందరి నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. .

మరోవైపు ఢిల్లీ కేబినెట్‌ మంత్రి అతిషి.. ఈడీకి సంబంధించి కీలక విషయాన్ని వెల్లడించనున్నట్లు పేర్కొన్న మరుసటిరోజే ఈ సోదాలు జరగటంతో ప్రాధాన్యం సంతరించుకొంది. కాగా మరో మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ కూడా బీజేపీ (BJP)కి చెందిన బెదిరింపు విభాగం-ED గురించి కీలక విషయాలను గుట్టురట్టు చేయనున్నట్లు తెలపడం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో అతిషి కీలక వ్యాఖ్యలు చేశారు.. గత రెండేళ్లుగా ఆప్​ నేతలను వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.

ఇప్పటికే అనేక సార్లు సమన్లు జారీ చేసినా, కొందరిని అరెస్ట్ చేసినా, ఒక్క రూపాయి సైతం ఈడీ రికవరీ చేయలేదని పేర్కొన్నారు. ఆప్​ నేతలను ఎక్సైజ్​ పాలసీ కుంభకోణంలో తప్పుడు సాక్ష్యాలు చెప్పాలంటూ, ఈడీ బెదిరిస్తోందని ఆరోపించారు. మరోవైపు ఈడీ, కేజ్రీవాల్​కు ఐదుసార్లు సమన్లు జారీ చేసింది. అయితే పలు కారణాలు పేర్కొంటూ, కేజ్రీవాల్​ ప్రతిసారీ విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో ఈడీ ఈ వ్యవహారంపై ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ డిస్ట్రిక్ట్ కోర్ట్ ను ఆశ్రయించింది.

You may also like

Leave a Comment