Telugu News » Asaduddin: రాహుల్ గాంధీపై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు!

Asaduddin: రాహుల్ గాంధీపై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణ(telangana)లో బీజేపీ, కాంగ్రెస్ నా రాయల్ ఎన్‌ఫీల్డ్‌ (Royal Enfield) బైక్‌కు ఉన్నన్ని సీట్లు గెలవలేరని అసదుద్దీన్ సెటైర్లు విసిరారు.

by Mano
Asaduddin: Asaduddin sensational comments on Rahul Gandhi!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్(Asaduddin) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఎంఐఎం, బీఆర్ఎస్‌లు బీటీం అని రాహుల్ చేసిన వాఖ్యలకు అసదుద్దీన్ ఘాటుగానే స్పందించారు. తెలంగాణ(telangana)లో బీజేపీ, కాంగ్రెస్ నా రాయల్ ఎన్‌ఫీల్డ్‌ (Royal Enfield) బైక్‌కు ఉన్నన్ని సీట్లు గెలవలేరని అసదుద్దీన్ సెటైర్లు విసిరారు.

Asaduddin: Asaduddin sensational comments on Rahul Gandhi!

రాహుల్ బాబా తమను బీజేపీకి బీ టీం అంటూ ఏడుపు ప్రారంభించారని ఎద్దేవా చేశారు. మరి రాహుల్ తన అమేథి సీటును బీజేపీకి ఎందుకు గిఫ్ట్‌గా ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. మరి బీటీంలు ఉన్న బీజేపీ తెలంగాణలో ఎందుకు బలహీనపడిందో చెప్పాలని సవాల్ విసిరారు.

సేఫ్ సీటు కోసమే రాహుల్ బాబా వయానాడ్‌కు వెళ్లాల్సి వచ్చిందని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ నా రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌కు ఉన్నన్ని సీట్లు గెలవలేరని ఈ సందర్భంగా రాహుల్.. అసదుద్దీన్‌పై సెటైర్లు విసిరారు.

మరోవైపు రాహుల్‌పై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్‌లో దివ్యాంగుల పెన్షన్ లబ్ధిదారుల సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ 11సార్లు ఛాన్స్‌ ఇస్తే మంచినీళ్లు కూడా ఇవ్వని కాంగ్రెస్ ఇప్పుడెలా ఇస్తుందని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఆగమాగం ఓట్లు వేయొద్దని ప్రజలకు సూచించారు.

You may also like

Leave a Comment