టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth-Reddy)పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఈ మధ్య తీవ్ర స్థాయిలో మండిపడటం కనిపిస్తూనే ఉంది.. మరోవైపు కాంగ్రెస్ విడుదల చేసిన మ్యానిఫెస్టోపై అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో నాంపల్లిలో జరిగిన ప్రచారంలో పాల్గొన్న అసదుద్దీన్.. కాంగ్రెస్ (Congress)పై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లో మైనార్టీ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
తెలంగాణలో మాత్రమే కీలక హామీలు ఇస్తున్న కాంగ్రెస్.. రాజస్థాన్‌లో కూడా ఎన్నికలు జరుగుతున్న విషయాన్ని గుర్తించాలని అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) తెలిపారు. మైనార్టీ డిక్లరేషన్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్‌లో కూడా మైనార్టీ డిక్లరేషన్ లేదని..అక్కడ ఎందుకు మైనార్టీ డిక్లరేషన్ ప్రకటన చేయలేదని ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ తన కుటంబానికి చెందిన సీటునే కాపాడుకోలేక పోతున్నాడాని అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. మరోవైపు తెలంగాణలో మంచి స్కీమ్‌లు ఉన్నాయని, అవన్నీ తమ ప్రజలకు అందుతున్నట్లు ఓవైసీ తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న షాదీ ముబారక్ (Shaadi Mubarak)..కళ్యాణ లక్ష్మీ (Kalyana Lakshmi) లాంటి స్కీమ్‌లు, ఆసర పింఛన్లు ఇక్కడి ప్రజలకు ఉపయోగంగా ఉన్నట్టు ఓవైసీ వెల్లడించారు.