Telugu News » BJP : తెలంగాణ పగ్గాలు చేపట్టడానికి బీజేపీ స్పెషల్ ప్లాన్.. వాటిపై ఫోకస్..!!

BJP : తెలంగాణ పగ్గాలు చేపట్టడానికి బీజేపీ స్పెషల్ ప్లాన్.. వాటిపై ఫోకస్..!!

ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే రెండు సార్లు తెలంగాణలో పర్యటించారు. మరోసారి నవంబర్ నెల ఆఖర్లో 25, 26,27 తేదీల్లో సుడిగాలి పర్యటన చెయ్యబోతున్నారు. నవంబర్ 17న తెలంగాణలో పర్యటించడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amita Shah) టూర్‌ కూడా దాదాపుగా ఖరారైంది.

by Venu
bjp-big-plans-for-parliament-elections

ఓటర్లను ప్రసన్నం చేసుకునే దిశగా కాంగ్రెస్ (Congress) బీజేపీ, బీఆర్ఎస్ (BRS) పార్టీలు హామీల మీద హామీలు గుప్పిస్తున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ బీఆర్‌ఎస్ పాత పథకాలకు కొత్త కలర్లు అద్ది ఎట్రాక్టివ్ స్టయిల్‌తో రంగంలోకి దిగింది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీలు ప్లస్ ఆరు డిక్లరేషన్లు వదిలి బిగ్‌ఫైట్‌కు రెడీ అయ్యింది. ఈ క్రమంలో ప్రజల్లోకి వెళ్లడంలో బీజేపీ కాస్త వెనకపడిందని అంతా భావించారు. ఇన్నాళ్లూ అభ్యర్థుల జాబితాల కసరత్తుతోనే సరిపెట్టుకున్న బీజేపీ తర్వాత అసమ్మతుల్ని బుజ్జగించడం మీదే ఫోకస్ పెట్టిందని అనుకున్నారు.

ఈ క్రమంలో మరో రెండువారాలు మాత్రమే ఎన్నికలకు గ్యాప్ ఉండడంతో బీజేపీ (BJP) ప్రచారంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. ఈ క్రమంలో తెలంగాణను రౌండప్ చేసి అగ్రనేతల చేతుల మీదుగా తాయిలాల చిట్టా కూడా విడుదల చేయాలన్నది భారతీయ జనతా పార్టీ ప్లాన్ గా తెలుస్తుంది. ఈ మేరకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు మించి బీజేపీ మేనిఫెస్టో (Manifesto)లో ఏమేం ఉండబోతుందనే ఆసక్తి తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో నెలకొంది.

తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి (Kishan Reddy) ప్రస్తుత పథకాల్ని కొనసాగిస్తూనే కొత్త పథకాల్ని ప్రవేశపెడతామని ప్రకటించారు. కాషాయం గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి అనే హామీ వదిలి కొంత సెన్సేషన్‌ క్రియేట్ చేసిన కమలం.. హైదరాబాద్‌ సహా కొన్ని ప్రాంతాల పేర్ల మార్పుపై కీలక ప్రకటన కూడా చేసింది. ఉచిత విద్య, ఉచిత వైద్యం లాంటి మరికొన్ని కీలక అంశాలు కూడా మేనిఫెస్టోలో ఉండేలా బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఉపాధి అవకాశాలపై ఫోకస్ పెట్టి నిరుద్యోగ యువతే టార్గెట్‌గా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలనే ఆలోచనలో కమలం ఉన్నట్టు తెలుస్తుంది.

ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ప్రధాని నరేంద్ర మోదీ రెండు సార్లు తెలంగాణలో పర్యటించారు. నవంబర్ నెల ఆఖర్లో 25, 26,27 తేదీల్లో మరోసారి సుడిగాలి పర్యటన చెయ్యబోతున్నారు. నవంబర్ 18న తెలంగాణలో పర్యటించడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amita Shah) టూర్‌ కూడా దాదాపుగా ఖరారైంది. మరోవైపు ఒకే రోజు నాలుగు సభలకు ప్లాన్ చేసిన బీజేపీ.. నల్గొండ, వరంగల్, గద్వాల్, రాజేంద్రనగర్‌లో అమిత్‌ షా పబ్లిక్ మీటింగ్స్‌కి ఏర్పాట్లు షురూ చేసింది.

అదే రోజు బీజేపీ తెలంగాణ మేనిఫెస్టో రిలీజ్ చేయాలన్నది కమలనాథుల ఎత్తుగడ. ఇప్పటికే మేనిఫెస్టోను రూపొందించిన కాషాయ దళం.. తుది మెరుగులు దిద్దుతుందని సమాచారం.. కాగా ఇచ్చే హామీలు జనరంజకంగా ఉండేలా నేతలు ఫ్లాన్ చేస్తున్నారు. మరోవైపు హామీల విషయంలో రెండు పార్టీలూ ముందు వరసలో ఉండగా.. బీజేపీ వీళ్లిద్దరికీ మించి ఇచ్చే స్పెషల్ హామీలు ఏంటీ అనేది సస్పెన్స్ గా ఉంది.

You may also like

Leave a Comment