తెలంగాణలో (Telangana) తమ పార్టీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ (Congress) బీజేపీ(BJP) బీఆర్ఎస్ (BRS) ధీమాగా ఉన్నాయి. అయితే ఓటర్ల నాడీ పక్కాగా ఎరిగిన వ్యక్తి కేసీఆర్ (KCR)అని ఇప్పటికే పేరుంది. మరి ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఏం మ్యాజిక్ చేసి, అధికారం చేపట్టి, హ్యాట్రిక్ సాధిస్తారో అనే ఆసక్తి రాష్ట్రంలో నెలకొంది.
ఇదే విషయాన్ని హరీష్ రావు, కేటీఆర్ ప్రతి సభలో చెబుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఎల్బీనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ మాజీ ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ తన సతీమణి మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీప్రసన్నతో ఇటీవల కాంగ్రెస్ లో చేరారు. ఆశించిన విధంగా కాంగ్రెస్ లో పరిస్థితులు అనుకూలించక పోవడంతో పార్టీకి బైబై చెప్పారు.
ఈ క్రమంలో మంత్రి హరీష్ రావు, రామ్మోహన్ గౌడ్ నివాసానికి చేరుకొని దంపతులకు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీష్ రావు (Harish Rao) మీడియాతో మాట్లాడుతూ.. రామ్మోహన్ గౌడ్ ఉద్యమకారుడని.. తమతో కలిసి పని చేశాడని అన్నారు.. సహచరుడిని కాపాడుకోవాలి అని వచ్చామని తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచేది లేదని.. డబ్బాలో రాళ్ళు వేసి కొడుతున్నారన్నారని ఎద్దేవా చేశారు.. ఇప్పటి వరకి అన్ని సర్వేలు బీ ఆర్ఎస్ గెలుపు ఖాయం అంటున్నాయని తెలిపారు.