అసెంబ్లీ ఎన్నికలలో నేతల మధ్య చోటు చేసుకున్న విమర్శలు.. పోలీసుల వరకు వ్యాపిస్తున్నాయి. ఇప్పటికే కొందరు పోలీస్ అధికారులు బీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారనే అపవాదు ప్రచారంలో ఉంది. మరోవైపు చట్టం ఎవరికి చుట్టం కాదని పోలీసులు అంటారు.. ఏది ఏమైనా పోలీస్ ఉద్యోగం కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకి కోపం అనేలా ఉంటుందని కొందరు అనుకుంటారు.
ప్రస్తుతం కాంగ్రెస్ (Congress) అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ (Anjan Kumar Yadav) బీఆర్ఎస్ (BRS) అభ్యర్థి ముఠాగోపాల్ (Muthagopal) చిక్కడపల్లి ఏసీపీ (ACP)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిక్కడపల్లి ఏసీపీ.. బీఆర్ఎస్ కి కోవర్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తన నామినేషన్లో తప్పులు ఉన్నాయని ఏసీపీ ప్రచారం చేయాల్సిన పని ఏముందని అంజన్ కుమార్ యాదవ్ విరుచుకుపడ్డారు. ఏదైనా తప్పిదాలు ఉంటే రిటర్నింగ్ అధికారి చూసుకుంటాడని తెలిపారు.
ఏసీపీ, ముఠాగోపాల్ బంధువులు అయితే ఇంట్లో చూసుకోవాలి కానీ ఇలా అవసరం లేని విషయాల్లో తల దూర్చకూడదని అంజన్ కుమార్ పేర్కొన్నారు.. ఎన్నికల్లో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఏసీపీ పని చేస్తున్నారని ఆరోపించిన అంజన్ కుమార్.. తాము అనుమతి తీసుకొని ఎన్నికల ప్రచారం నిర్వహించుకుంటున్న ఆంక్షల పేరుతో అడ్డుతగలడం సరికాదని అన్నారు.. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఏసీపీ గ్రహించి తన పని తాను చేసుకుంటే మంచిదని అంజన్ కుమార్ హితబోధ చేశారు..
బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే.. హైదరాబాద్ నగరం అభివృద్ధి చేస్తామని, మంత్రి కేటీఆర్ (KTR) గొప్పలు చెప్పుకుంటూ ప్రచారాలు నిర్వహిస్తున్నాడని అంజన్ కుమార్ విమర్శించారు. గత పదేళ్లుగా అభివృద్ధి చేయకుండా… ప్రభుత్వ భూములు అమ్ముకోవడమేనా అభివృద్థి అంటే అని అంజన్ కుమార్ యాదవ్ మండిపడ్డారు.