భారత దేశంలో స్వాతంత్ర్య పూర్వం ఓ రకం రాజకీయాలు నడిచాయి. అప్పటి రాజకీయాల్లో పాలకులు ఒకరిపై ఒకరు పోరాటాలు, కుట్రలు నడిపి యుద్ధాలు చేసి పంతం నెగ్గించుకునే వారు.. అందులో ప్రజల్ని బలి పశువుల్ని చేసేవారు. అలా విదేశీ దోపిడీదారులకు తలుపులు తెరిచి.. దేశ సంపదను, సంస్కృతిని, స్వేచ్ఛను పరాయి వాడికి తాకట్టు పెట్టారు. కళ్ళు తెరిచేసరికి మహోన్నత భారత దేశం బానిసత్వంలో మగ్గింది.
ఇక విప్లవయోధులు, అతివాదులు, మితవాదులు, మధ్యే వాదులు.. ఇలా భిన్న కోణాలలో స్వతంత్ర పోరాటం చేశారు. అలా ఎన్నో చేపలు రాచకీయంలో చిక్కుకున్నాయి. ఇక్కడా రాజకీయం రాజ్యమేలింది. ఫలితంగా మతం పేరుతో వేలాది మంది బలయ్యారు. దేశం రెండు ముక్కలైంది. మరోవైపు స్వతంత్ర భారత దేశంలో రాజకీయం వికృత రూపం దాల్చింది. పలు పార్టీలు వెలుగులోకి వచ్చాయి.
ఒక పార్టీ స్వతంత్రం మేమే తెచ్చామంటే.. మరోపార్టీ పేదలు, కార్మికులను ఉద్ధరిస్తామని బయలు దేరింది. అందులో అతివాదం, మితవాదం, తీవ్రవాదం పేరుతో కుంపట్లు పెట్టారు. మతం, భాష, ప్రాంతం, కులాలు ఆధారంగా పార్టీలు ఏర్పడి జనాన్ని విభజించడం మొదలు పెట్టాయి. అలా ప్రస్తుత కాలంలో రాజకీయం కాస్త రాచకీయంగా మారింది. ఈ రాజకీయాన్ని అడ్డుపెట్టుకుని వ్యక్తులు ఎదిగారు.. కానీ ప్రజలు మాత్రం అక్కడే ఒంటరిగా మిగిలి పోతున్నారు.. బలి అవుతున్నారు.. ఇది రాజకీయానికి ఉన్న చరిత్ర..
ఇక తెలంగాణ (Telangana)లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) నిలబడే అభ్యర్థులు అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.. ఇందులో అత్యంత ధనవంతుడుగా మునుగోడు (Munugodu) నుంచి కాంగ్రెస్ (Congress) అభ్యర్దిగా పోటీ చేయనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) రాష్ట్రంలో ఎన్నికల అభ్యర్థుల్లో అత్యంత ధనవంతుడుగా నిలిచారు. తనకు, తన భార్య లక్ష్మికి రూ.458.37 కోట్ల ఆస్తులు ఉన్నాయని ప్రకటించారు. అయితే 2018లో జరిగిన ఎన్నికల అఫిడవిట్ లో 314 కోట్ల రూపాయల ఉమ్మడి ఆస్తులను ప్రకటించిన రాజగోపాల్ రెడ్డి ఆస్తుల నికర విలువ.. ప్రస్తుతం 45% పైగా పెరిగిందన్నట్టు..
మరోవైపు పైళ్ల శేఖర్ రెడ్డి (Pailla Shekhar Reddy)..భువనగిరి బీఆర్ఎస్ (BRS) అభ్యర్థి గా ఉన్న.. ఈయన రాష్ట్రంలోనే అత్యంత సంపన్న అభ్యర్థిగా రెండో స్థానంలో నిలిచారు. కాగా ఆయన ఆస్తులు రూ.227 కోట్లుగా తెలిపారు. ఇక దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి (Prabhakar Reddy) ఆస్తులు రూ.197 కోట్లుగా అఫిడవిట్ లో పేర్కొన్నారు.. మరోవైపు అత్యంత పేద రైతుగా మన ముఖ్యమంత్రి నిలిచారని జనం అనుకుంటున్నారు.