Telugu News » Rapido : ఉచితంగా ప్రయాణం చేయండి.. ఓటర్లకు ర్యాపిడో బంపర్ ఆఫర్..!!

Rapido : ఉచితంగా ప్రయాణం చేయండి.. ఓటర్లకు ర్యాపిడో బంపర్ ఆఫర్..!!

ప్రతిసారీ హైదరాబాద్‌ నగరంలో ఓటింగ్‌ 55 శాతానికి మించడం లేదని.. ఈసారి ఓటర్లలో మార్పు రాల్సిన అవసరం ఉందని పవన్ గుంటుపల్లి తెలిపారు. దానికోసమే తమ ప్రయత్నమని వెల్లడించారు.. చూశారా ఓటర్లు.. మీ ఓటు విలువ తెలుసుకోండి.. సరైన నాయకుని ఓటు వేయండని ఆఫర్ గురించి విన్న వారు తెలుపుతున్నారు..

by Venu

ఎన్నికల వేళ నేతలు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటారో లేదో తెలియదు కానీ.. ప్రముఖ బైక్ ట్యాక్సీ సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. భారత రాజ్యాంగంలో ఓటు ఎంత కీలకమో వివరిస్తూ.. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొనాలని పిలుపునిచ్చింది. ఓటు వేసే వారికోసం ఉచితంగా సర్వీసు అందిస్తామని తెలిపింది. ఆ వివరాలు చూస్తే..

తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) నేపథ్యంలో, ప్రముఖ బైక్ ట్యాక్సీ సంస్థ ర్యాపిడో హైదరాబాద్ ఓటర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఓటింగ్ రోజున నగరంలోని 2,600 పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను ఉచితంగా తీసుకెళతామని ప్రకటించింది.. తద్వారా ఓటింగ్ శాతం పెరిగేలా తమవంతు తోడ్పాటు అందిస్తున్నామని వెల్లడించింది. దానికోసం వోట్‌ నౌ (VOTENOW) అనే కోడ్‌ అప్లయ్‌ చేయాలని సంస్ధ సహ వ్యవస్థాపకుడు పవన్‌ గుంటుపల్లి తెలిపారు.

తమ ఉచిత రైడ్ పథకం ముఖ్యంగా యువ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించడంలో ఉపయోగపడుతుందని భావిస్తున్నట్టు ర్యాపిడో (Rapido) సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి తెలిపారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు ఎలా చేరుకోవాలనే చింత అక్కర్లేదని, ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు ర్యాపిడో బైక్ ల ద్వారా ఉచితంగా చేరవేస్తామని పవన్ గుంటుపల్లి పేర్కొన్నారు. ఓటు వేసే క్రమంలో రవాణా వ్యవస్థ ఇబ్బందికరంగా మారకూడదన్నది తమ అభిమతమని ఆయన వివరించారు.

ప్రతిసారీ హైదరాబాద్‌ నగరంలో ఓటింగ్‌ 55 శాతానికి మించడం లేదని.. ఈసారి ఓటర్లలో మార్పు రాల్సిన అవసరం ఉందని పవన్ గుంటుపల్లి తెలిపారు. దానికోసమే తమ ప్రయత్నమని వెల్లడించారు.. చూశారా ఓటర్లు.. మీ ఓటు విలువ తెలుసుకోండి.. సరైన నాయకుని ఓటు వేయండని ఆఫర్ గురించి విన్న వారు తెలుపుతున్నారు..

You may also like

Leave a Comment