Telugu News » AP Assembly Elections : ఎన్నికల కమిషన్ తో చంద్రబాబు-పవన్ కళ్యాణ్.. కీలక విషయాలపై ఫిర్యాదు..!!

AP Assembly Elections : ఎన్నికల కమిషన్ తో చంద్రబాబు-పవన్ కళ్యాణ్.. కీలక విషయాలపై ఫిర్యాదు..!!

ముందుగా నోవోటెల్ లో బస చేస్తున్న పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్ళిన చంద్రబాబు, అక్కడి నుంచి ఈసీ ఏర్పాటు చేసిన సమా వేశానికి వెళ్లారు. అనంతరం సమావేశం ఏర్పాటు చేశారు.

by Venu

ఏపీ (AP)లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఓట్ల జాబితాలోని సమస్యలు, పోలింగ్ నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా విజయవాడ (Vijayawada) చేరుకొంది. నేడు ముఖ్య పార్టీల నేతలతో సమావేశం నిర్వహించింది.

ఈ సమావేశానికి టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu)తో పాటు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వెళ్లారు. ముందుగా నోవోటెల్ లో బస చేస్తున్న పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్ళిన చంద్రబాబు, అక్కడి నుంచి ఈసీ ఏర్పాటు చేసిన సమా వేశానికి వెళ్లారు. అనంతరం సమావేశం ఏర్పాటు చేశారు. ఏపీలో ఎన్నికలపై ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా చర్యలు చేపట్టాలని కొరినట్టు, ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ఎన్నికల్లో అవకతవకలు జరిగే అవకాశం ఉన్నట్టు అందుకే సచివాలయ సిబ్బందిని ఎన్నికల డ్యూటీకి దూరంగా ఉంచాలని కోరామన్నారు. దొంగ ఓట్లపై చర్యలు తీసుకోవాలని, వాటిని ప్రశ్నిస్తే బైండోవర్ కేసులతో ప్రతి పక్షాలను వేదిస్తున్నారని ఈసీ (EC)కి వివరించినట్టు పేర్కొన్నారు.. తమ కార్యకర్తలను పనిచేసుకోనివ్వడం లేదని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు.

ఈ క్రమంలో ఏపీలో ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరగాలని సీఈసీ నిర్ణయం తీసుకుందన్నారు. సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు అన్ని అంశాలు సీఈసీకి చెప్పినట్టు తెలిపారు. కాగా చంద్రగిరిలో దాదాపు లక్ష పైచిలుకు దొంగ ఓట్లు నమోదయ్యాయి. వీటిలో కొన్ని ఆమోదం కూడా జరిగాయి. అందుకే ప్రతి నియోజకవర్గంలో నమోదవుతున్న దొంగఓట్లపై సీఈసీకి ఫిర్యాదు చేశామన్నారు.

మరోవైపు ఏపీలో ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.. వైసీపీ అధికారంలోకి వచ్చాక అక్రమ కేసులు పెరిగిపోయాయని తెలిపారు. కాగా త్వరలో ఏపీలో జరిగే ఎన్నికల్లో విజయం కోసం టీడీపీ, జనసేన గట్టి ప్రయత్నాలే మొదలు పెట్టారని అనుకొంటున్నారు.. వైసీపీ ఓటమి లక్ష్యంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది.

You may also like

Leave a Comment