ఎన్నికల ప్రచారంలో పలు వింతలు చోటు చేసుకోవడం కామన్.. ఎన్నికలు వచ్చాయంటే చాలు ప్రచారాలు చేసే సమయంలో అభ్యర్థులు దోశలు వేయడం, చాకిరేవు దగ్గర బట్టలు ఉతకడం, పిల్లల టాయిలెట్ కడగడం వంటి పనులు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరోవైపు కొత్తగా పోటీ చేసే అభ్యర్థులు ఒక్క ఛాన్స్ అంటూ వేడుకుంటారు. అభివృద్థి మంత్రాన్ని పువ్వులుగా మార్చి ఓటర్ల చెవిలో పెడతారని కొందరు అనుకోవడం తెలిసిందే.
ఇక ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) టికెట్ దక్కించుకున్న హుజురాబాద్ (Huzurabad) నియోజకవర్గ (Constituency) బీఆర్ఎస్ (BRS) అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) దయచేసి ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇవ్వండని ఓటర్లను రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం శ్రీరాములపల్లి, కనగర్తి, మల్యాల, లక్ష్మాజిపల్లి గ్రామాలని పాడి కౌశిక్ రెడ్డి పర్యటించారు.. బై ఎలక్షన్ లో ఇక్కడి ఎమ్మెల్యే గెలిచి రెండేళ్లు గడిచినా కనీసం తట్టేడు మట్టి అన్న ఇక్కడ పోసిండా? అని ప్రశ్నించారు.
మరోవైపు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇల్లంతకుంట ప్రజలకు 5 హామీలు ఇచ్చారు. తనను గెలిపిస్తే ఇల్లంతకుంటను టెంపుల్ సిటీ చేస్తానని, తాళ్ళల్లో మంచి రిసార్ట్ ఏర్పాటు చేపిస్తా అని తెలిపారు. రిజర్వాయర్ ను మంచి టూరిస్ట్ స్పాట్ గా అభివృద్ధి చేస్తానని, ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మిచడమే కాకుండా.. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కట్టిస్తానని పేర్కొన్నారు. ఈ పనులన్ని జరగాలంటే దయచేసి ఎమ్మెల్యేగా ఒక్క సారి అవకాశం కలిపించాలని పాడి కౌశిక్ రెడ్డి కోరారు. ఈ 28 రోజులు నా కోసం కష్టపడితే ఐదు సంవత్సరాలు మీకోసం కష్టపడతానని కౌశిక్ తెలిపారు.