మెదక్ (Medak) ఎంపీ (MP) కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy)పై జరిగిన హత్యాయత్నం ఘటన బీజేపీ మెడకు చుట్టుకుంటుందా అనే అనుమానాలు జనాల్లో మొదలైయ్యాయి. మొదట కాంగ్రెస్ వైపు అనుమానపు గాలి వీచగా చివరికి దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు (Raghunandan Rao) నోటికి పని కల్పించాయని అంటున్నారు. ఈ నేపధ్యంలో కొత్త ప్రభాకర్‌రెడ్డి హత్యాయత్నం ఘటనపై రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో పోలీసులు పూర్తి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ ఎంపీ పై దాడికి పాల్పడిన వ్యక్తి బీజేపీ మద్దతుదారుడిగా అవుతున్న ప్రచారంపై పోలీసులు స్పందించాలని.. నాతో చాట్ చేసినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై చర్యలు తీసుకోవాలని రఘునందన్ కోరారు. దాడి చేసిన నిందితుడు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా బీజేపీ కార్యకర్తలు కనిపిస్తే కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. అధికార పార్టీ ఆగడాలు పట్టించుకోని పోలీసులు వారికి కొమ్ము కాయడం మానుకోవాలని రఘునందన్ రావు అన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు 4 + 4 సెక్యూరిటీ కల్పించాలని ఆదేశించిన అడిషనల్ డీజీపీ, ప్రతిపక్ష ఎమ్మెల్యే అభ్యర్థులకు సెక్యూరిటీని ఎందుకు కల్పించడం లేదని రఘునందన్ రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు ఇష్టా రీతిగా ప్రవర్తిస్తుంటే పట్టనట్టు వ్యవహరించడం తగదని మందలించారు..
మరోవైపు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, 30 పోలీస్ ఆక్ట్ అమల్లో ఉన్న సమయంలో దుబ్బాకలో బీఆర్ఎస్ కార్యకర్తలు గుంపులు గుంపులుగా తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని రఘునందన్ రావు ప్రశ్నించారు.. సాయంత్రం వరకు దుబ్బాక బంద్‌పై పోలీసుల రియాక్షన్ ఏంటో చూస్తామని, వారు స్పందించకుంటే దుబ్బాక పరిణామాలపై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని రఘునందన్ తెలిపారు..