తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Elections) కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మొదటి ఫలితం(First Result) రానేవచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట నియోజకవర్గాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అశ్వారావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి జారే ఆదినారాయణ ఘన విజయం సాధించారు.
బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై 23,358 ఓట్లతో ఆదినారాయణ గెలుపొందారు. అదేవిధంగా భద్రాద్రి జిల్లా ఇల్లందులో కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య విజయం సాధించారు. కోరం కనకయ్య… బీఆర్ఎస్ అభ్యర్థి అయిన బానోతు హరిప్రియపై తన విజయాన్ని నమోదు చేసుకున్నారు.
ఇల్లందులో కోరం కనకయ్య 18వేల ఓట్లతో విజయం సాధించారు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి బానోతు హరిప్రియ నాయక్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండగా ఓటమి పాలయ్యారు. అధికార బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రస్తుతం హోరాహోరీగా అధిక్యతలో దూసుకుపోతున్నాయి.అంతిమంగా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లను సాధించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
తెలంగాణ అసెంబ్లీలో 119 సీట్లు ఉన్నాయి. 60 సీట్లు సాధిస్తే చాలు ఇక్కడ ప్రభుత్వాలను ఏర్పాటు చేయొచ్చు. అయితే అధికారానికి అవసరమైన 60 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే లీడ్‌లో ఉంది. మరోవైపు బీఆర్ఎస్ కేవలం హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో అన్ని స్థానాల్లో నిరాశే ఎదురైంది. ఈ ఎన్నికల్లో ఎవరు గెలవనున్నారనేది మరో రెండు గంటల్లో తేలిపోనుంది.