Telugu News » Assembly Sessions 2023 : అసెంబ్లీ సాక్షిగా.. సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ అక్బరుద్దీన్..!!

Assembly Sessions 2023 : అసెంబ్లీ సాక్షిగా.. సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ అక్బరుద్దీన్..!!

మైనార్టీలు అంటే కేవలం ఎంఐఎం పార్టీనే కాదని తెలిపిన రేవంత్.. ముస్లింలకు అండగా నిలబడింది కాంగ్రెస్ పార్టీ అనే విషయా

by Venu

తెలంగాణ (Telangana) అసెంబ్లీలో కరెంట్ అప్పులపై చర్చ హాట్ గా సాగింది. ముఖ్యంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ (MLA Akbaruddin).. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మధ్య పవర్ టాపిక్ పవర్ ఫుల్ గా సాగినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖ (Electricity Department) తీరుపై తెలంగాణ సీఎం మండిపడ్డారు.. ఇదే సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు..

aimim-leader-akbaruddin-owaisi-threatens-police

కరెంట్ విషయంలో ఓల్డ్ సిటీ నిర్లక్ష్యానికి గురైందంటూ ఆరోపించిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్.. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కరెంట్ సరిగా లేదని.. ఒక్క వైర్ కూడా కొత్తగా వేయలేదని వెల్లడించారు. మరోవైపు విద్యుత్ అప్పులపై ఇచ్చిన శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని విమర్శించిన అక్బరుద్దీన్… ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఈ శ్వేతపత్రం తీసుకొచ్చిందంటూ ప్రశ్నించారు.. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేయకుండా.. కరెంట్ చార్జీలు పెంచకుండా ఉచిత కరెంట్ ఎలా ఇస్తుందని అక్బరుద్దీన్ ప్రశ్నించారు..

ఈమేరకు సీఎం రేవంత్ రెడ్డి అక్బరుద్దీన్ ప్రశ్నలపై ఘాటుగా స్పందించారు.. విద్యుత్ బిల్లుల బకాయి చిట్టాని విప్పిన రేవంత్.. బకాయిల్లో సిద్దిపేట నియోజకవర్గం ఫస్ట్ ప్లేస్ లో ఉందని.. గజ్వేల్ రెండో స్థానంలో ఉందని.. హైదరాబాద్ సౌత్.. ఓల్డ్ సిటీ మూడో స్థానంలో ఉందని చురకలు అంటించారు.. గత ప్రభత్వ హయాంలో విద్యుత్ బకాయిలు వందల కోట్లు పెండింగ్ ఉంటే.. ఎంఐఎం పార్టీ ఇన్నాళ్లు ప్రశ్నించక పోవడానికి కారణం ఏంటని? రేవంత్ ఎదురు క్వచ్చన్ వేశారు..

మైనార్టీలు అంటే కేవలం ఎంఐఎం పార్టీనే కాదని తెలిపిన రేవంత్.. ముస్లింలకు అండగా నిలబడింది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని గుర్తుంచు కోవాలని సూచించారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కదా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు కేసీఆర్ తో కలిసి.. బీఆర్ఎస్ తరపున జూబ్లీహిల్స్ లో అభ్యర్థిని నిలబెట్టింది ఎవరు అంటూ రేవంత్ రెడ్డి .. అక్బరుద్దీన్ ను ప్రశ్నించారు..

కొన్ని చోట్ల నుంచి కరెంట్ బిల్లులు సరిగ్గా కట్టకపోవటం.. విద్యుత్ సంస్థలు నష్టాల్లో ఉండటానికి ఓ కారణంగా పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి.. మీ దోస్తులు కేసీఆర్, హరీశ్ రావును అడిగి ఆ బిల్లులు ఏవో కట్టించరాదా అంటూ అక్బరుద్దీన్ కి చురకలు అంటించారు..

You may also like

Leave a Comment