Telugu News » Atchannaidu: వైసీపీ ఫేక్ పోస్టులను ఊరికే వదిలిపెట్టం: అచ్చెన్నాయుడు

Atchannaidu: వైసీపీ ఫేక్ పోస్టులను ఊరికే వదిలిపెట్టం: అచ్చెన్నాయుడు

వైసీపీ ఫేక్ పోస్టులను ఊరికే వదిలిపెట్టమని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. పడటం, కాళ్లు మొక్కడం వంటి సంస్కృతి వైసీపీదని, టీడీపీకి ఆ అవసరం లేదని తెలిపారు.

by Mano
Atchannaidu: YCP will not leave fake posts alone: ​​Atchannaidu

వైసీపీ ఫేక్ పోస్టులను ఊరికే వదిలిపెట్టమని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Nayudu) ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమితా(Minister Amith shah) , బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda)తో చర్చలు జరిగిపిన విషయం విధితమే.

Atchannaidu: YCP will not leave fake posts alone: ​​Atchannaidu

అయితే, చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు అమిత్‌పై కాళ్లు పట్టుకున్న ఫేక్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ వీడియోపై అచ్చెన్నాయుడు సీరియస్‌గా స్పందించారు. అమిత్ ఆహ్వానం మేరకే చంద్రబాబు హస్తినకు వెళ్లినట్లు వెల్లడించారు. అక్కడి పరిణామాలపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటారని, చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా, అది రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఉంటుందన్నారు.

వైఎస్ జగన్‌లా వ్యక్తిగత స్వార్థం కోసం కాదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. బీజేపీ కాళ్లపై పడటం, కాళ్లు మొక్కడం వంటి సంస్కృతి వైసీపీదని, తెలుగుదేశానికి ఆ అవసరం లేదని తెలిపారు. అనేక కేసుల్లో ఏ1 ముద్దాయిగా వైఎస్ జగనే బీజేపీ కాళ్ల మీద పడతాడని అన్నారు. వైసీపీ ఫేక్ పోస్టులను ఊరికే వదిలిపెట్టం అని వార్నింగ్ ఇచ్చారు.

ఇక, నిరుద్యోగ సమస్య, మహిళల భద్రతపై టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన నిర్వహించారు. సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనలో పాల్గొన్నారు. ‘ఉపాధి లేక నిరుద్యోగుల ఆకలి కేకలు.. రక్షణ లేక మహిళల ఆర్తనాదాలు’ అంటూ బ్యానర్ ప్రదర్శించారు.

ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రానికి వైసీపీ ప్రభుత్వం రూపంలో పట్టిన శని, దరిద్రం నేటితో వదిలిపోతుందన్నారు. కౌరవ సభను మళ్లీ గౌరవ సభగా మారుస్తామని వ్యాఖ్యానించారు. శాసన సభను ఐదేళ్లుగా వైసీపీ కార్యాలయలా నడిపారంటూ ధ్వజమెత్తారు.

You may also like

Leave a Comment