Telugu News » Guwahati : అసోంలో దారుణం.. హోటల్‌లో తెలంగాణ విద్యార్థిని మృతి..!!

Guwahati : అసోంలో దారుణం.. హోటల్‌లో తెలంగాణ విద్యార్థిని మృతి..!!

మరోవైపు డిసెంబర్‌ 31న అర్ధరాత్రి హోటల్‌ తనిఖీలో భాగంగా వెళ్లినప్పుడు ఐశ్వర్యతో పాటు ఇతర స్నేహితులు మద్యం మత్తులో ఉన్నట్లు హోటల్ సిబ్బంది పోలీసులకు తెలిపారు.. న్యూ ఇయర్ పార్టీ ముగించుకుని అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో వీరంతా హోటల్‌కు వచ్చారని, అప్పటికే బాగా మద్యం సేవించి ఉన్నారన్నారు..

by Venu

అసోం (Assam)లో, తెలంగాణ (Telangana)కు చెందిన విద్యార్థిని ఓ హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి (Died) చెందింది. మృతురాలు అస్సాంలోని ఐఐటీ గువాహటి (IIT Guwahati)లో ఇంజినీరింగ్‌ చదువుతున్నట్టు గుర్తించారు.. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీటెక్‌ నాలుగో సంవత్సరం చదువుతోన్న పుల్లూరి ఐశ్వర్య, నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో ముగ్గురు స్నేహితులతో కలిసి బయటకి వెళ్ళినట్టు సమాచారం..

ఈ నేపథ్యంలో ఐఐటీ క్యాంపస్‌కు 25 కి.మీల దూరంలో ఉన్న ఓ హోటల్‌లో రెండు గదులను బుక్‌ చేసుకొని.. డిసెంబర్‌ 31న వారంతా హోటల్‌కు చేరుకున్నారని పోలీసులు వెల్లడించారు.. జనవరి 1న ఉదయం తనతోపాటు గదిలో ఉన్న మరో స్నేహితురాలు ఐశ్వర్య అచేతనావస్థలో ఉండటాన్ని గుర్తించినట్టు తెలిపారు.. వెంటనే గువాహటి మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు.

మరోవైపు డిసెంబర్‌ 31న అర్ధరాత్రి హోటల్‌ తనిఖీలో భాగంగా వెళ్లినప్పుడు ఐశ్వర్యతో పాటు ఇతర స్నేహితులు మద్యం మత్తులో ఉన్నట్లు హోటల్ సిబ్బంది పోలీసులకు తెలిపారు.. న్యూ ఇయర్ పార్టీ ముగించుకుని అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో వీరంతా హోటల్‌కు వచ్చారని, అప్పటికే బాగా మద్యం సేవించి ఉన్నారన్నారు..

అయితే యువతి అతిగా మద్యం సేవించడం వల్లే మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే మరణానికి కారణాలు తెలుస్తాయంటున్నారు.. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు.. మృతురాలి ముగ్గురు స్నేహితులను విచారిస్తున్నారు.

You may also like

Leave a Comment