Telugu News » Hyderabad : హిట్ అండ్ రన్ యాక్ట్ ఎఫెక్ట్.. నగరంలో గుర్రంపై ఫుడ్ డెలివరీ..!!

Hyderabad : హిట్ అండ్ రన్ యాక్ట్ ఎఫెక్ట్.. నగరంలో గుర్రంపై ఫుడ్ డెలివరీ..!!

హైదరాబాద్ (Hyderabad) చంచల్ గూడలో, ఓ ఫుడ్ డెలివరీ బాయ్ ఏకంగా గుర్రం మీద స్వారీ చేస్తూ.. ఫుడ్ ఆర్డర్ ను డెలివరీ చేయడానికి వెళ్తున్నప్పుడు నెటిజన్స్ వీడియో తీసి సోషల్ మీడియాలో (Social Media) పోస్ట్ చేశారు.

by Venu
zomato food delivery

భారతదేశ (India) వ్యాప్తంగా హిట్ అండ్ రన్ యాక్ట్ వల్ల ట్రక్, ట్యాంకర్లు ధర్నాకు దిగుతున్నారనే వార్తలతో పెట్రోల్ బంకులు (Petrol Bunks) బిజీగా మారిపోయాయి.. మూడు రోజుల వరకు ఇంధనం దొరకదనే భయంతో వాహన దారులు బంకుల ముందు క్యూ కట్టారు.. దీంతో నగరంలో భారీగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. ఈ ప్రభావం ఫుడ్ డెలివరీ (Food Delivery) చేసే ఓ బాయ్స్ పై పడింది.

ఈ మేరకు దాదాపు మూడు గంటల పాటు ఫుడ్ డెలివరీ చేసే ఆ బాయ్ పెట్రోల్ బంక్ దగ్గర క్యూ లైన్ లో వేచి ఉన్నాడు. అప్పటికి పెట్రోల్ దొరక్క పోవడంతో విసుగు చెందిన ఆ యువకుడు.. ఓ గుర్రం అద్దెకు తీసుకుని దానిపై ఫుడ్ ఆర్డర్ లను డెలివరీ చేశాడు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హైదరాబాద్ (Hyderabad) చంచల్ గూడలో, ఓ ఫుడ్ డెలివరీ బాయ్ ఏకంగా గుర్రం మీద స్వారీ చేస్తూ.. ఫుడ్ ఆర్డర్ ను డెలివరీ చేయడానికి వెళ్తున్నప్పుడు నెటిజన్స్ వీడియో తీసి సోషల్ మీడియాలో (Social Media) పోస్ట్ చేశారు.

దీంతో ఆ వీడియో కాస్తా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా నెటిజన్స్ ఈ ఘటనపై రకరకాలుగా స్పందిస్తున్నారు. హెల్మెట్ అవసరం లేదు.. జరిమానా పడదు.. ట్రాఫిక్ ఇబ్బంది లేదంటూ ట్రోల్ చేస్తున్నారు.. ఆ ఫుడ్ డెలివరీ బాయ్ చేసిన పనిపై పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు రాత్రి కేంద్ర ప్రభుత్వం, డ్రైవర్ల అసోసియేషన్ తో జరిపిన చర్చలు సక్సెస్ కావడంతో, డ్రైవర్లు నిరసనను విరమించుకొన్నారు..

ఈ క్రమంలో ట్యాంకర్లతో ఆయిల్ కంపెనీలకు వాహనాలు చేరుకొంటున్నాయి. ఈరోజు తెల్లవారుజాము కల్లా హైదరాబాద్ నగరంలోని అన్ని పెట్రోల్ బంకులకు ట్యాంకర్లు ఫుల్ లోడ్ తో చేరుకున్నాయి. దీంతో రాత్రితో పోల్చుకుంటే.. పెట్రోల్ బంకుల దగ్గర ప్రస్తుత పరిస్థితులు నిలకడగా ఉన్నాయని సమాచారం..

You may also like

Leave a Comment