Telugu News » Ap : జగన్‌పై బండరాయితో కాదు ‘ఎయిర్ గన్‌’తో దాడి.. రాప్తాడు ఎమ్మెల్యే సంచలన కామెంట్స్!

Ap : జగన్‌పై బండరాయితో కాదు ‘ఎయిర్ గన్‌’తో దాడి.. రాప్తాడు ఎమ్మెల్యే సంచలన కామెంట్స్!

ఏపీ సీఎం జగన్ పై విజయవాడ ఎన్నికల ప్రచార ర్యాలీలో బండరాయితో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఘటనపై అటు రాష్ట్ర పోలీసు యంత్రాంగం సీరియస్‌గా విచారణ జరుపుతోంది. ఈ ఘటనపై ఎన్నికల సంఘం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.

by Sai
Attack on Jagan not with a stone but with an 'air gun'.. MLA makes sensational comments! Community-verified icon

ఏపీ సీఎం జగన్ పై విజయవాడ ఎన్నికల ప్రచార ర్యాలీలో బండరాయితో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఘటనపై అటు రాష్ట్ర పోలీసు యంత్రాంగం సీరియస్‌గా విచారణ జరుపుతోంది. ఈ ఘటనపై ఎన్నికల సంఘం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రిపై దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఎన్నికల సంఘం సమగ్ర దర్యాప్తుతో కూడిని రిపోర్టు అందజేయాలని విజయవాడ నగర్ కమిషనర్ క్రాంతి రాణాను ఆదేశించింది.

Attack on Jagan not with a stone but with an 'air gun'.. MLA makes sensational comments!

Community-verified icon

విజయవాడలోని వివేకానంద స్కూల్ వద్ద సీఎం జగన్ మీద గుర్తుతెలియని వ్యక్తులు బండరాళ్లతో దాడులకు పాల్పడ్డారు. అయితే, వీరు స్కూల్ బిల్డింగ్ మీద నుంచి పక్కా ప్లాన్ ప్రకారమే దాడులు చేసి ఉంటారని అటు పోలీసులు, వైసీపీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు వివేకానంద స్కూల్ వద్ద డాగ్ స్వ్కాడ్
సాయంతో నిందితుల ఆచూకీని కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఆ బండరాళ్లపై ఉన్న వేలి ముద్రల గుర్తులను కూడా పోలీసులు సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు సమాచారం.

ఇకపోతే, ఏపీ సీఎం జగన్ (AP cm Jagan) పై బండరాయితో దాడి జరగలేదని, ఎయిర్ గన్‌ (Air GUN)తో జరిగి ఉండొచ్చని వైసీపీ పార్టీ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి (Mla thopudurthi prakash) ఆదివారం సంచలన ఆరోపణలు చేశారు. ‘బండరాయితో కొడితే సీఎం జగన్ నుదిటికి సరిగ్గా ఎలా తగులుతుంది. ఇది పక్కా ఎయిర్ గన్‌తో గురిపెట్టి కాల్చి ఉంటారని నాకు అనుమానంగా ఉంది.

బుల్లెట్ పెల్లెట్ జగన్ తలకు తలగడం వలన గాయం అయ్యింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక ఆయనకు సెక్యూరిటీని కూడా తగ్గించారు. ఈ ఘటనపై లోతైన విచారణ జరిపించాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.

You may also like

Leave a Comment