తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) స్టేషన్ ఘన్ పూర్ టిక్కెట్ ప్రకటించినప్పటీ నుంచి తాటికొండ రాజయ్య (Tatikonda Rajaiah), కడియం శ్రీహరి (Kadiyam Srihari) మధ్య వివాదం (Dispute) రాజుకున్నట్లైయ్యింది. ఒకరిపై ఒకరు వాడివేడి విమర్శలు చేసుకుంటున్న వీరిద్దరూ ఇవాళ హాయ్ బాస్, హాలో ఎలాగున్నావన్నా అని పలకరించుకున్నారు.
ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి సీతారామాలయంలో చోటుచేసుకుంది. ఆలయ పున:ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గన్న ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరీ ఒకరికొకరు ఎదురయ్యారు. ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుని చక్కగా పలకరించుకోవడమే కాకుండ ఇద్దరూ కలసి ఒకే వేదికమీద కూర్చున్నారు కూడా.
ఉప్పూ నిప్పులా ఉండే ఇద్దరూ ఇలా ఒకేవేదికమీద కనిపించడంతో అక్కడికి వచ్చినవారంతా ఏం జరుగుతోందని కాస్త ఆసక్తిగానే గమనించారు. అయితే రాజయ్య కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు.
బీఆర్ఎస్ పార్టీ.. స్టేషన్ ఘన్ పూర్ టికెట్ ను కడియం శ్రీహరికి ప్రకటించడంతో మొదలైన కడియం, రాజయ్యల మధ్య యుద్ధం రోజుకో మలుపు తీసుకుంటోంది. ఒకరిమీద మరొకరు రోజూ విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో వీరిద్దరూ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు.
ఈసారి స్టేషన్ ఘన్ పూర్ టికెట్ తనకే వస్తుందని రాజయ్య ఎన్నోసార్లు బహిరంగంగా ప్రకటించినప్పటికీ, బీఆర్ఎస్ అధిష్ఠానం కడియం శ్రీహరికి ఈసారి స్టేషన్ ఘన్ పూర్ టికెట్ కేటాయించిన సంగతి తెలిసిందే. దీంతో రాజయ్య బహిరంగంగా కన్నీరు పెట్టుకున్నారు. ఇంకా స్టేషన్ ఘన్ పూర్ టిక్కెట్ పై ఆశలు వదులుకోని రాజయ్య మాత్రం…కేసీఆర్ కి తాను హనుమంతుడి లాంటివాడిననీ, ఎప్పటికీ కేసీఆర్ వెంటే ఉంటానంటున్నారు.