Telugu News » Telangana Elections: ఎన్నికల బరిలో నిలిచే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఇలా సిద్ధమవుతోంది.

Telangana Elections: ఎన్నికల బరిలో నిలిచే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఇలా సిద్ధమవుతోంది.

తెలంగాణా రాష్ట్ర కాంగ్రేస్ ఎమ్మెల్యే టికట్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ధరఖాస్తులను పరిశీలించి తుది జాబితాను తయారుచేసే కార్యక్రమం జెట్ స్పీడ్ తో కొనసాగుతోంది.

by Prasanna
congress screening committee

త్వరలో జరగనున్న తెలంగాణా శాసనసభ (Telanagana Elections) ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్‌ (Congress) ఆశావహుల నుంచి దరఖాస్తులు స్ర్కీనింగ్ కమిటీకి చేరాయి. కమిటీ వద్దకు వచ్చిన దరఖాస్తుల వడపోత కూడా పూర్తయ్యింది. దీంతో అభ్యర్థులకు టిక్కెట్ల కేటాయింపులో భాగంగా స్క్రీనింగ్ కమిటీ (Screening committee) వర్క్ మొదలుపెట్టింది.

congress screening committee

తెలంగాణా రాష్ట్ర కాంగ్రేస్ ఎమ్మెల్యే టికట్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ధరఖాస్తులను పరిశీలించి తుది జాబితాను తయారుచేసే కార్యక్రమం జెట్ స్పీడ్ తో కొనసాగుతోంది. దీనికోసం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి (పీసీసీ), స్ర్కీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్, జిగ్నేశ్ మేవాని, బాబా సిద్ధిఖీతోపాటు కొంతమంది బృందం హైదరాబాద్ చేరుకున్నారు.

వీరు పీఈసీ సభ్యులతో విడివిడిగా చర్చించి తుది జాబితాను తయారుచేస్తారు. ఇవాళ, రేపు పీఈసీ (ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ), డీసీసీ అధ్యక్షులు, పార్టీ సీనియర్లతో ప్రత్యేకంగా సమావేశమై అభిప్రాయాలు సేకరించనుంది. బుధవారం సమావేశం కానున్న స్క్రీనింగ్ కమిటీ… పీఈసీ వడపోసి అందించిన జాబితాపై తుది నిర్ణయం తీసుకునేందుకు పని మొదలుపెడుతుంది.

రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పోటీచేయనున్న 119 నియోజక వర్గాలకు పోటీ గట్టిగానే ఉంది. వీటిలో కొన్ని మాజీలకూ, మరికొన్ని సీనియారిటీ ప్రాతిపదికన…ఇలా దాదాపు 25 నుంచి 30  సీట్ల అభ్యర్ధులు ఖరారైనట్టేనని సమాచారం.  కొండగల్, మధిర నియోజకవర్గాలలో ఒక్కొక్క ధరఖాస్తు మాత్రమే వచ్చింది. మిగిలిన సెగ్మెంట్స్ కోసం  ఒక్కోదాని కోసం ప్రాధన్యతల వారీగా ముగ్గురు అభ్యర్థులతో జాబితా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే  కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ఈ నెలాఖరు కల్లా ప్రకటించే అవకాశం ఉంది.

You may also like

Leave a Comment