Telugu News » Jamili Elections, A Cospiracy: జమిలితో దక్షిణ భారతదేశ ఉనికికే ప్రమాదం: రేవంత్ రెడ్డి

Jamili Elections, A Cospiracy: జమిలితో దక్షిణ భారతదేశ ఉనికికే ప్రమాదం: రేవంత్ రెడ్డి

అధ్యక్ష తరహా ఎన్నికల కోసమే మోడీ (Modi) జమిలి ఎన్నికలంటూ అడుగులేస్తున్నారని తెలంగాణా పీసీసీ చీఫ్ రేవత్ రెడ్డి అన్నారు.  అధ్యక్ష తరహా ఎన్నికలతో దక్షిణాది ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చే కుట్ర ఉందని ఆరోపించారు.

by Prasanna
Ravanth reddy

Jamili Elections, A Cospiracy: జమిలితో దక్షిణ భారతదేశ ఉనికికే ప్రమాదం: రేవంత్ రెడ్డి

జమిలి ఎన్నిక (Jamili Elections) ల విధానంతో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి ఆటంకం కలుగుతుందని, అధ్యక్ష తరహా ఎన్నికల కోసమే మోడీ (Modi) జమిలి ఎన్నికలంటూ అడుగులేస్తున్నారని తెలంగాణా పీసీసీ చీఫ్ రేవత్ రెడ్డి (Revanth Redyy) అన్నారు.  అధ్యక్ష తరహా ఎన్నికలతో దక్షిణాది ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చే కుట్ర ఉందని ఆరోపించారు.

Ravanth reddy

మోడీ, అమిత్ షా ద్వయం మాటలను  నమ్మె స్థితిలో ప్రజలు లేరని… తెలంగాణలో కూడా కాంగ్రెస్ గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. ఓడిపోతామనే జమిలీ ఎన్నికలను మోడీ ముందుకు తెచ్చారని ఆరోపణ చేశారు.

జమిలీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని, జమిలీ ఎన్నికలకు బీఆర్ఎస్ అనుకూలంగా ఉందని, జమిలీ ఎన్నికలకు సమ్మతి తెలుపుతూ 2018లో సిఎం కెసిఆర్ లేఖ రాసిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ ఈ రెండూ పార్టీలు ఒకేటేనని అన్నారు. జమిలీ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని సూచించారు.

వన్ నేషన్-వన్ ఎలక్షన్ కాదని, వన్ పార్టీ-వన్ పర్సన్ అనేది బీజెపి విధానమని, జమిలి ఎన్నికల విధానం వెనక భారీ కుట్ర దాగి ఉన్నదని రేవంత్త్ రెడ్డి చెప్పారు. ‘రాష్ట్రాల సమూహమే దేశం’ అనే రాజ్యాంగ స్ఫూర్తికి జమిలి ఎన్నికల విధానం విరుద్ధమైనదన్నారు.

దేశంలో ఒకే పార్టీ ఉండాలనే కుట్రతోనే అధికారాన్ని తన చేతుల్లో పెట్టుకోడానికి బీజేపీ ఈ కుట్ర పాల్పడుతున్నదని ఆరోపించారు. ఈ తరహా ఆలోచనలు దేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, ఇది చిరవకు నియంత పాలన వైపు దారి తీస్తుందని హెచ్చరించారు. అంతే కాకుండా జమిలి ఎన్నికలతో దక్షిణ భారత దేశ ఉనికి ప్రశ్నార్థకమవుతుందని రేవంత్ రెడ్డి అన్నారు.

You may also like

Leave a Comment