Telugu News » Harish Rao : అలాంటివి మళ్లీ రిపీట్ కావొద్దు.. రేవంత్ సర్కారుకు హరీశ్ రావు కీలక డిమాండ్!

Harish Rao : అలాంటివి మళ్లీ రిపీట్ కావొద్దు.. రేవంత్ సర్కారుకు హరీశ్ రావు కీలక డిమాండ్!

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వైఫల్యాలపై బీఆర్ఎస్(BRS) పార్టీ ఫోకస్ చేస్తోంది. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ (CONGRESS)వైఫల్యాలు, తప్పిదాలు, ఆరుగ్యారెంటీల హామీల(SIX Guarentees Failure) ఫెయిల్యూర్‌పై వరుసగా ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. దీంతో ప్రజలను తిరిగి బీఆర్ఎస్ వైపు మళ్లేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

by Sai
I will resign from my MLA post if I waive the loan before August 15.. Harish Rao challenges CM Revanth!

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వైఫల్యాలపై బీఆర్ఎస్(BRS) పార్టీ ఫోకస్ చేస్తోంది. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ (CONGRESS)వైఫల్యాలు, తప్పిదాలు, ఆరుగ్యారెంటీల హామీల(SIX Guarentees Failure) ఫెయిల్యూర్‌పై వరుసగా ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. దీంతో ప్రజలను తిరిగి బీఆర్ఎస్ వైపు మళ్లేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

Such things should not be repeated again.. Harish Rao's key demand for Revanth Sarkar!

ఈ క్రమంలోనే తాజాగా మాజీ మంత్రి హరీశ్ రావు(Mla Harish Rao) రేవంత్ రెడ్డి సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన సోషల్ మీడియా (ఎక్స్)వేదికగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వ హాస్టళ్లలో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ సంఘటనలపై ప్రశ్నించారు.

‘మొన్న భువనగిరి గురుకుల హాస్టల్లో కలుషిత ఆహారం(Polluted Food) తిని చనిపోయిన ప్రశాంత్ ఉదంతాన్ని మరువక ముందే మరో ఫుడ్ పాయిజన్ ఉదంతం వెలుగుచూసింది. తాజాగా నిర్మాల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని కేజీవీబీ పాఠశాలలో శుక్రవారం 11 మంది విద్యార్థినులు కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు.

బీఆర్ఎస్ పాలనలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ గురుకులాల పట్ల కాంగ్రెస్ నిర్లక్ష వైఖరికి ఈ ఉదంతాలు అద్దం పడుతున్నాయి. ప్రభుత్వం వెంటనే బాధిత విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం’ అని హరీశ్ రావు పేర్కొన్నారు.

You may also like

Leave a Comment