Telugu News » Ayodhya : బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్న పొలిటికల్‌ ఫంక్షన్‌.. అందుకే శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్టకు వెళ్ళం..!!

Ayodhya : బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్న పొలిటికల్‌ ఫంక్షన్‌.. అందుకే శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్టకు వెళ్ళం..!!

తమ పార్టీ నేతలు అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకావడం లేదని కాంగ్రెస్‌ ప్రకటించింది. మరోవైపు ఆలయ ప్రారంభోత్సవానికి హాజరుకావాలని సోనియాగాంధీ, మల్లిఖార్జున్‌ ఖర్గే, అధిర్‌ రంజన్‌ చౌదరికి ఆహ్వానాలు అందాయి.

by Venu

అయోధ్య (Ayodhya)లో శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకను దేశమంతా పండుగలా జరుపుకుంటోంది. ఇది అయోధ్యకు మాత్రమే కాదు…దేశం మొత్తానికి దివ్య దీపావళిలా భావిస్తున్నారు ప్రజలు. దేశం నలుమూలల నుంచి ఈ వేడుకను చూడాలని ఎందరో భక్తులు వివిధ మార్గాల ద్వారా అయోధ్యకు చేరుకొన్నారు.. ఇలా ఎంతో భక్తితో జరుగుతోన్న ఈ కార్యక్రమం పొలిటికల్‌గా విభేదాలు రేపుతోంది.

Ayodhya: Ways to worship Rama at home.. These are the verses to recite..!!

రామ మందిర గర్భ గుడిలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానాలు అందిన వారంతా ఇప్పటికే చేరుకొన్నారు. కానీ ఇండియా కూటమి నేతలు మాత్రం అయోధ్య వెళ్లం అంటున్నారు. సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్‌ గాంధీ (Rahul Gandhi), ఖర్గే, మమత, కేజ్రీవాల్‌ వీరంతా కూడా రామయ్య వేడుకను రాజకీయ కోణంలో చూస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. ఇది బీజేపీ పండుగంట, అంతా రాజకీయమంట అనేది వాళ్ల ఆరోపణ. అందుకే బాయ్‌కాట్‌ అంటున్నామన్నారు.

ఇప్పటికే తమ పార్టీ నేతలు అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకావడం లేదని కాంగ్రెస్‌ ప్రకటించింది. మరోవైపు ఆలయ ప్రారంభోత్సవానికి హాజరుకావాలని సోనియాగాంధీ, మల్లిఖార్జున్‌ ఖర్గే, అధిర్‌ రంజన్‌ చౌదరికి ఆహ్వానాలు అందాయి. అయితే అయోధ్య పేరుతో బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయాలు చేశాయని కాంగ్రెస్‌ ఆరోపించింది. అందుకే ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదని ప్రకటించింది.

రామమందిరం ప్రారంభోత్సవంపై ఇటీవల స్పందించిన రాహుల్‌ గాంధీ.. పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రధాని మోదీ చేపట్టిన రాజకీయ కార్యక్రమమని, ఓట్ల కోసమే ఈ పాట్లని ఆరోపించారు. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్న పొలిటికల్‌ ఫంక్షన్‌ కాబట్టే దానికి తాము హాజరు కావట్లేదని పేర్కొన్నారు. ఒకవేళ తమ పార్టీ నేతలు అయోధ్యకు వెళితే అభ్యంతరం చెప్పబోమన్నారు. మొత్తానికి రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఇండియా కూటమి దూరంగా ఉండటం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ అయ్యింది..

You may also like

Leave a Comment