Telugu News » Ayodhya : రాం లల్లా ప్రాణ ప్రతిష్టకు ‘ఎంట్రీ పాస్’…ఇన్విటేషన్ కార్డుతో పాటు పాస్ తప్పనిసరి ….!

Ayodhya : రాం లల్లా ప్రాణ ప్రతిష్టకు ‘ఎంట్రీ పాస్’…ఇన్విటేషన్ కార్డుతో పాటు పాస్ తప్పనిసరి ….!

ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన క్రతువులను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్‌తో పాటు దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు హాజరు కాబోతున్నారు.

by Ramu
ayodhya ram mandir entry pass for attendees temple trust releases

అయోధ్య (Ayodhya)లో ‘రామ్ లల్లా’(Ram Lalla)ప్రాణ ప్రతిష్టకు మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన క్రతువులను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్‌తో పాటు దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

ayodhya ram mandir entry pass for attendees temple trust releases

తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించి ఎంట్రీ పాసులను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జారీ చేసింది. ఈ ఎంట్రీ పాసులో ప్రత్యేకమైన క్యూ ఆర్ కోడ్‌ను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద క్యూ ఆర్ కోడ్ స్కానర్లను ఏర్పాటు చేశామని పేర్కొంది. ఆ క్యూర్ కోడ్‌ను స్కాన్ చేసిన తర్వాత వివరాలు సరిపోలితే ఆహ్వానితులను ఆలయంలోకి అనుమతిస్తామని ట్రస్టు సభ్యులు వెల్లడించారు.

క్యూ ఆర్ కోడ్ లేకుండా కేవలం ఆహ్వానం ఉన్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని పేర్కొన్నారు. ఇప్పటికే ఆహ్వానితులకు ఇన్విటేషన్ డాకెట్‌ను పోస్టులో పంపామని అయోధ్య డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాల్ వెల్లడించారు. దీంతో పాటు ఆహ్వానితుల వాట్సాప్ నెంబర్లకు డిజిటల్‌గా లింకును కూడా పంపినట్టు పేర్కొన్నారు. ప్రాణ ప్రతిష్టకు వచ్చే వారిలో చాలా మంది సాదువులు, వృద్దులు ఉన్నారని, వాళ్లకు టెక్నాలజీ గురించి పెద్దగా అవగాహన లేదని వెల్లడించారు.

అందువల్ల వాళ్లకు సహాయం చేసేందుకు ప్రత్యేకమైన హెల్ప్ డెస్కు ను ఏర్పాటు చేశామని తెలిపారు. కేవలం ఆహ్వాన పత్రికలను పట్టుకుని వచ్చే వారికి హెల్ప్ డెస్క్ సహాయం చేస్తుందని వివరించారు. ట్రస్టుతో సమన్వయం చేసకుంటూ ఈ హెల్ప్ డెస్క్ ఆహ్వానితుల వివరాలను వెరిఫై చేసుకుంటూ వాళ్లను ఆలయంలోకి అనుమతించే విషయాన్ని చూసుకుంటుందని పేర్కొన్నారు.

ఇక ఎంట్రీ పాసులకు సంబంధించిన కాపీని కూడా ట్రస్టుకు షేర్ చేశారు. ఈ పాసులో పేరు, మొబైల్ నంబర్, ఆధార్ కార్డు నంబర్ లాంటి ముఖ్యమైన సమాచారం ఉంటుంది. ఇప్పటి వరకు సుమారు 7వేల మందికి పైగా ఆహ్వానాలు పంపినట్టు ట్రస్టు పేర్కొంది. అందులో 3 వేల మంది వీవీఐపీలకు కూడా ఆహ్వానం పంపినట్టు వెల్లడించింది.

You may also like

Leave a Comment