Telugu News » Ayodhya : అయోధ్య వెళ్లిన వ్యక్తికి బెదిరింపులు.. పాకిస్థాన్ వెళ్లిపోవాలని కౌంటర్..!!

Ayodhya : అయోధ్య వెళ్లిన వ్యక్తికి బెదిరింపులు.. పాకిస్థాన్ వెళ్లిపోవాలని కౌంటర్..!!

సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా పోస్ట్‌లు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌లు సైతం వినిపిస్తున్నాయి.

by Venu

దేశంలోని కోట్లాది మంది ప్రజల ఏండ్ల నాటి కల ఈ ఏడాది జనవరి 22తో సాకారం అయ్యిందనే ఆనందంలో ఉన్నారు.. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh), అయోధ్య (Ayodhya)లో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం వేడుకకు విదేశాల్లోని ప్రముఖులు హాజరయ్యారు. ఇందులో భాగంగా ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇమామ్ డాక్టర్ ఉమర్ అహ్మద్ ఇలియాసి (Umar Ahmed Ilyasi) సైతం అయోధ్య ట్రస్ట్ ఆహ్వానం మేరకు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరయ్యారు.

అయితే ఈ అంశాన్ని జీర్ణించుకోలేని కొన్ని వర్గాలు డాక్టర్ ఉమర్ అహ్మద్ ఇలియాసి పై బెదిరింపులకు దిగారు. బాబ్రీ మసీద్ (Babri Masjid) కూలగొట్టి నిర్మించిన అయోధ్య రామ మందిరం ఓపెనింగ్‌కు ఇలియాసి వెళ్లడం ముస్లింలోని కొన్ని వర్గాలకు ఏ మాత్రం నచ్చలేదని తెలుస్తోంది. దీంతో ఆయనను చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌లు చేసిన బెదిరింపులకు గురి చేయడం సంచలనంగా మారింది.

అదీగాక సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా పోస్ట్‌లు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌లు సైతం వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బెదిరింపు వార్తలపై స్పందించిన ఇలియాసి.. రామ మందిరం ఓపెనింగ్‌కు వెళ్లినందుకు కొన్ని వర్గాల నుంచి తనకు బెదిరింపులు వస్తోంది నిజమేనని దృవీకరించారు.

అయితే వివాదాలు చుట్టుముట్టినప్పటికీ తన సంఘం నుంచి ఎదురవుతున్న పరిస్థితులకు అధైర్యపడకుండా ఐక్యత, సామరస్యాన్ని పెంపొందించడంలో నిబద్ధతతో ఉన్నానని ఇలియాసీ పేర్కొన్నారు.. ఈ విషయంలో తనపై ద్వేషం చిమ్ముతున్న వారంతా పాకిస్థాన్ వెళ్లిపోవాలని కౌంటర్ ఇచ్చారు. భిన్నత్వంలో ఏక్వత్వానికి నిదర్శనమైన భారత్‌లో, మత సామరస్యం కోసమే తాను అయోధ్యకు వెళ్లినట్లు క్లారిటీ ఇచ్చారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పనని తేల్చారు.

You may also like

Leave a Comment