అయోధ్య(Ayodya)లో రామ మందిరం(Ram Mandir) ప్రారంభోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. జనవరి 22న రామాలయంలో రామ్‌లల్లా ప్రతిష్ఠాపనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే అయోధ్య చేరుకున్నారు.
శ్రీకాంత్ షిండే తన పార్టీ అధికారులతో కలిసి అయోధ్య చేరుకున్నారు. శ్రీ రామమందిర్ ట్రస్టుకు రూ.11కోట్ల విరాళాన్ని రామమందిర్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్‌కు చెక్కును రూపంలో అందజేశారు. ఈ డబ్బు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఖాతాకు బదిలీ చేశారు.
శ్రీకాంత్ షిండే మాట్లాడుతూ.. మహారాష్ట్ర ప్రజలు, రామభక్తుల తరఫున ఇది ఒక చిన్న సంజ్ఞ అని వ్యాఖ్యానించారు. రామ మందిరాన్ని నిర్మించాలనే కలను తన తరం ముందు సాకారమవుతుండడం సంతోషంగా ఉందన్నారు.
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సాహెబ్ తరఫున, తమ పార్టీ ప్రధాన నాయకుడు, శివసేన, మహారాష్ట్ర ప్రజలు, రామ భక్తుల తరఫున రామ మందిరానికి రూ.11కోట్లను విరాళంగా అందిస్తున్నామని శ్రీకాంత్ షిండే చెప్పుకొచ్చారు.