Telugu News » Delhi : విద్యార్థులకు మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న ముఠా గుట్టురట్టు..!!

Delhi : విద్యార్థులకు మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న ముఠా గుట్టురట్టు..!!

నిందితుల నుంచి పెద్ద మొత్తంలో స్వదేశీ, విదేశీ మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకొన్నారు. ఇప్పటికే అమిటీ యూనివర్శిటీ సమీపంలో మాదక ద్రవ్యాల వ్యవహారం జోరుగా సాగుతుందనే ఆరోపణలున్నాయి.. ఇదే కేసులో రెండు నెలల క్రితం నలుగురు విద్యార్థులతో సహా తొమ్మిది మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.30 లక్షల విలువైన మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

by Venu

యువత భవిష్యత్తును చిన్నాభిన్నం చేస్తున్న మాదక ద్రవ్యాల రవాణా ఆగడం లేదు.. దేశంలో విచ్చల విడిగా లభ్యం అవుతోన్న వీటివల్ల ఎందరో యువతి యువకులు తమ జీవితాలను బలిచేసుకొంటున్న ఘటనలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి.. తాజాగా మాదకద్రవ్యాల ముఠా ఒకటి పోలీసులకు పట్టుబడటం కలకలం సృష్టిస్తుంది.

drugs

ఢిల్లీ (Delhi) ఎన్‌సీఆర్‌ (NCR)లోని యూనివర్సిటీలు, కాలేజీల్లో చదువుతోన్న విద్యార్థులే టార్గెట్ గా మాదక ద్రవ్యాలను సప్లయ్ చేస్తున్న ముఠా అధికారుల చేతికి చిక్కింది. సెక్టార్-126 నోయిడా (Noida) పోలీస్ స్టేషన్ పరిధిలో.. ఢిల్లీలో ఉన్న అమిటీ యూనివర్శిటీ, ఇతర విద్యా సంస్థల విద్యార్థులకు, ఇతరులకు మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న కేసులో అమిటీ యూనివర్సిటీ (Amity University) విద్యార్థి సహా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

నిందితుల నుంచి పెద్ద మొత్తంలో స్వదేశీ, విదేశీ మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకొన్నారు. ఇప్పటికే అమిటీ యూనివర్శిటీ సమీపంలో మాదక ద్రవ్యాల వ్యవహారం జోరుగా సాగుతుందనే ఆరోపణలున్నాయి.. ఇదే కేసులో రెండు నెలల క్రితం నలుగురు విద్యార్థులతో సహా తొమ్మిది మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.30 లక్షల విలువైన మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హరీష్ చందర్ మాట్లాడుతూ..నోయిడా యూనివర్శిటీ విద్యార్థులతో పాటు పరిసరాలలో నివసిస్తున్న విద్యార్థులు మళ్లీ డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకొంటున్నారని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి పోలీసులకు నిరంతరం సమాచారం అందుతున్నట్లు తెలిపారు. రహస్య సమాచారం మేరకు పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి గంజాయి, హషీష్‌తోపాటు భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు లభించినట్టు వెల్లడించారు..

You may also like

Leave a Comment