Telugu News » Babu Mohan : బీజేపీకి బాబు మోహన్ బిగ్ ట్విస్ట్.. పార్టీకి రాజీనామా చేస్తారా..?

Babu Mohan : బీజేపీకి బాబు మోహన్ బిగ్ ట్విస్ట్.. పార్టీకి రాజీనామా చేస్తారా..?

తన విషయంలో పార్టీ నాయకత్వం ప్రవర్తించే విధానాన్ని బట్టి బీజేపీలో కొనసాగాల వద్దా అనే నిర్ణయానికి వస్తానని బాబు మోహన్ వెల్లడించారు. టిక్కెట్ వస్తుందని ఆశించన తనకు నిరాశ ఎదురవటంతో తీవ్ర అసంతృప్తికి లోనైనట్టు ఆయన చెప్పుకొచ్చారు.

by Venu

బీజేపీ (BJP) సీనియర్ నేత బాబు మోహన్ (Babu Mohan) బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) పోటీ చేయటం లేదని తెలిపారు.. ఫస్ట్ లిస్టులో తన పేరు లేకపోవడంతో అలిగిన బాబు మోహన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు మొదటి లిస్టులో తన పేరు ఎందుకు లేదని తెలుసుకోవడానికి పార్టీ అధ్యక్షునికి ఫోన్ చేసినా స్పందన లేదని బాబు మోహన్ తెలిపారు.

తన విషయంలో పార్టీ నాయకత్వం ప్రవర్తించే విధానాన్ని బట్టి బీజేపీలో కొనసాగాల వద్దా అనే నిర్ణయానికి వస్తానని బాబు మోహన్ వెల్లడించారు. టిక్కెట్ వస్తుందని ఆశించన తనకు నిరాశ ఎదురవటంతో తీవ్ర అసంతృప్తికి లోనైనట్టు ఆయన చెప్పుకొచ్చారు. సోషల్ మీడియా (Social Media) తన కుటుంబంలో చిచ్చు పెడుతుందని, తన కుమారునికి తనకు మధ్య టికెట్ కోసం పోటీ నెలకొందని తప్పుడు ప్రచారం చేస్తూ మనోవేదనకు గురి చేస్తుందని బాబు మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా నరేంద్ర మోదీ మంచి నాయకుడన్న బాబుమోహన్ రాష్ట్రంలో ఉన్న నేతల తీరు మాత్రం సరిగ్గా లేదని విమర్శించారు.. ఇక రెండో లిస్టులో తన పేరు వచ్చినా తాను మాత్రం పోటీ చేయనని బాబు మోహన్ తెలిపారు. మరోవైపు టీడీపీ తరపున రాజకీయారంగేట్రం చేసిన బాబుమోహన్ 1999లో మెదక్ జిల్లా ఆందోల్ శాసనసభ నియోజకవర్గం నుంచి శాసన సభ్యులుగా ఎన్నికై య్యారు. సాంఘిక సంక్షేమ శాఖా మంత్రిగా పనిచేశాడు.

2004, 2014 లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన బాబుమోహన్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. 2018 లో బీజేపీలో చేరిన బాబు మోహన్ ఆందోల్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే గా పోటి చేసి ఓడిపోయాడు. అప్పటి నుంచి రాజకీయాల్లో అడపాదడపా కనిపిస్తూ తన ఉనికిని చాటుతూ వస్తున్న బాబుమోహన్ బీజేపీ ఇచ్చిన ట్విస్ట్ కి రాజకీయాలకు దూరం అవుతారా? అనే అనుమానాన్ని లేవనెత్తారని రాజకీయ వర్గాలలో అనుకుంటున్నారు..

You may also like

Leave a Comment