అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) నేపథ్యంలో భారీగా డబ్బులు, ఓటర్లకు పంచడానికి రెడీగా ఉన్న వస్తువులు పట్టుబడుతున్నాయి. ఓటర్లను ప్రలోభపెట్టి ఎలాగైనా గెలవాలనే ఆలోచనతో నగదుతో పాటు వివిధ రకాల వస్తువులు పంపిణీ చేసేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. మహిళ ఓటర్లను ఆకర్షించేందుకు మిక్సీలు, కుక్కర్లతో పాటు పట్టు చీరలు పంపిణీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
మరోవైపు ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. కాగా ఇప్పటికే ఈ తనిఖీలలో భారీగా నగదు స్వాధీనం చేసుకొన్నారు పోలీసులు. తాజాగా హైదరాబాద్ (Hyderabad) బాచుపల్లి ( Bachupally) పోలీస్ స్టేషన్ (Police Station) పరిధిలో 2 కోట్ల రూపాయల విలువైన పట్టుచీరలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
లారీలో తరలిస్తున్న పట్టుచీరలను.. ఓ అపార్ట్ మెంట్ లో డంప్ చేస్తున్నట్టు అందిన సమాచారంతో తనిఖీలు చేపట్టిన అధికారులకు పట్టుచీరల లోడుతో ఉన్న రెండు లారీలు పట్టుబడ్డాయి. కాగా వాటిని సీజ్ చేసి పీఎస్ కు తరలించామని పోలీసులు వెల్లడించారు. మరోవైపు హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో ముమ్మరంగా జల్లెడ పడుతున్నారు. లారీలు, కార్లు, బైకులు, ఆటోలతో పాటు అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్నా చెక్ చేసి పంపిస్తున్నారు పోలీసులు అధికారులు..