ఏపీలో ఎన్నికలు(AP Elections) దగ్గర పడుతుండడంతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. సీఎం జగన్ నిర్ణయాలతో అధికార పార్టీ నేతలు పక్కచూపులు చూస్తున్నారు. టికెట్ కన్ఫామ్ కాదనే విషయం తెలిసి కొందరు నేతలు ఇతర పార్టీ నేతలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నారు.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి(Ex Minister Balineni Srinivas Reddy) అదేబాట పట్టారంటూ ఈ మధ్య వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే, అవాన్నీ అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు. వచ్చే ఎన్నికల్లో తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అది కూడా ఒంగోలు నుంచే పోటీ చేస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు.
విలువతోనే రాజకీయాలు చేస్తున్నానంటూ బాలినేని చెప్పుకొచ్చారు. అందుకే మంత్రి పదవిని సైతం వదులకుని సీఎం వైఎస్ జగన్ వెంట నడిచానని తెలిపారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే ఎమ్మెల్యే స్థానాల మార్పు జరుగుతోందని సీఎం జగన్‌ను వెనకేసుకొచ్చారు. ఆయన మాటే శిరోధార్యమంటూ తెలిపారు.
ఇక, తాను గిద్దలూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నానన్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని బాలినేని తెలిపారు. అదేవిధంగా టీడీపీ నేతలతో టచ్‌లో ఉన్నాననేదీ అవాస్తవమని తేల్చేశారు. రాజకీయాల్లో ఉన్నంత వరకూ సీఎం వైఎస్ జగన్‌లో ఉంటానన్నారు. ప్రతీ ఒక్కరూ పార్టీకి, సీఎం జగన్‌కు అండగా ఉండాల్సిన సమయం అన్నారు.