Telugu News » High Court : ధరణి పోర్టల్​పై సస్పెన్స్.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు..!!

High Court : ధరణి పోర్టల్​పై సస్పెన్స్.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు..!!

ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి ఆలోచనలో ఉందో వివరణ ఇవ్వాలని నూతన అడ్వొకేట్ జనరల్ సుదర్శన్​ రెడ్డిని హైకోర్టు (High Court) అడిగింది. అయితే ప్రభుత్వ నిర్ణయం చెప్పడానికి 4 వారాల గడువు కావాలని ఏజీ చెప్పడంతో విచారణను ఫిబ్రవరి 2వ తేదీకి వాయిదా వేసింది.

by Venu
High Court on Tourism: Government's negligence on suspension... High Court is serious..!

గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్​ (Dharani Portal) విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదంటున్నారు.. అయితే ఈ పోర్టల్ పై స్పష్టతనివ్వాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ధరణిని కొనసాగిస్తారా?.. లేదా?.. చెబితే.. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని తమ ముందున్న పిటిషన్లను పరిష్కరిస్తామని తెలిపింది.

High Court on Tourism: Government's negligence on suspension... High Court is serious..!

ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి ఆలోచనలో ఉందో వివరణ ఇవ్వాలని నూతన అడ్వొకేట్ జనరల్ సుదర్శన్​ రెడ్డిని హైకోర్టు (High Court) అడిగింది. అయితే ప్రభుత్వ నిర్ణయం చెప్పడానికి 4 వారాల గడువు కావాలని ఏజీ చెప్పడంతో విచారణను ఫిబ్రవరి 2వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు ధరణి పోర్టల్​ పై తీవ్ర ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల ముందు నుంచి కాంగ్రెస్ (Congress) నేతలు పలు విమర్శలు చేశారు..

అయితే ఇప్పటికి ధరణి పోర్టల్​ వల్ల రైతులకి ఎలాంటి ఉపయోగం లేదనే వాదనలున్నాయి.. మరోవైపు ఈ పోర్టల్ వల్ల చాలా సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టిగాగులపల్లిలో వివిధ సర్వే నెంబర్లలోని 146.05 ఎకరాలకు చెందిన వివాదం రగులుకొంది.

ఈ భూమి విక్రయ దస్తావేజుల సర్టిఫైడ్ కాపీలను గండిపేట ఎమ్​ఆర్​ఓ ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ.. హైదరాబాద్​కు చెందిన ఎం జైహింద్ రెడ్డితో పాటు మరికొందరు ధరణిలో ఎదువుతున్న సమస్యలపై పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ లక్ష్మణ్ గత ఏడాది ఏప్రిల్లో విచారణ చేపట్టడంతో పాటు భూపరిపాలన ప్రధాన కమిషనర్​ను కోర్టుకు పిలిపించి పలు సందేహాలపై వివరణ కోరారు. మరోవైపు ధరణిలో 20 వరకు ప్రధానంగా సమస్యలు ఉన్నాయని కోర్టుకు వస్తున్న పిటిషన్ల ఆధారంగా గుర్తించారు.. ఈ నేపథ్యంలో వీటి పరిష్కారానికి మార్గం చూపుతారా.. లేదా ధరణి క్యాన్సిల్ చేస్తారా అనేది సస్పెన్స్ లో ఉంది..

You may also like

Leave a Comment