ఎన్నికల్లో తనకు ఓటు వేస్తే మోడీ(Modi) ప్రధానమంత్రి(Prime Minister) అవుతారని, కాంగ్రెస్ పార్టీకి వేస్తే ఓటు వృథా అవుతుందని బీజేపీ అభ్యర్థి(BJP Candidate) బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు. కరీంనగర్(Karimnagar)లోని ఎస్ఆర్ఆర్ కళాశాల(SRR College)లో శనివారం మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా వాకర్స్‌ను ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 400ఏళ్ల కళ శ్రీరామ మందిరం కలని మోడీ సాకారం చేశారని తెలిపారు. ఇండియన్ పొలిటికల్ లీగ్‌లో తమ కెప్టెన్ మోడీ(Modi) అని అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. చీటర్స్, లూటర్స్కు ఒక ఫైటర్‌కు మధ్య జరుగుతున్న ఎన్నికలు అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ను బొందపెట్టారని గుర్తు చేశారు.
పార్లమెంటు ఎన్నికల తర్వాత కేసీఆర్‌ను పాతాళ లోకానికి పాతిపెట్టడం ఖాయమన్నారు. ఎన్నికలప్పుడే కేసీఆర్ బయటకు వస్తాడని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం జరిగిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీలో బీఫాం తీసుకొని పార్టీలు మారారని బండి సంజయ్ తెలిపారు. వేములవాడ, రామలయాలను ప్రసాద్ స్కీం కింద అభివృద్ధి చేస్తానంటే అనుమతి ఇవ్వలేదన్నారు.
ఆర్వోబీ కోసం బీఆర్ఎస్ లేఖ ఇవ్వలేదని, కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ఆర్వోబీ కడుతున్నామని తెలిపారు. కరీంనగర్ స్మార్ట్ కోసం బీజేపీ ప్రభుత్వమే నిధులు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోటీ చేస్తుందో అర్థంకావడంలేదని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడో స్థానం, కాంగ్రెస్ పార్టీది రెండో స్థానమని స్పష్టం చేశారు.