Telugu News » Taiwan: వణికిపోతున్న తైవాన్.. మరోసారి భారీ భూకంపం..!

Taiwan: వణికిపోతున్న తైవాన్.. మరోసారి భారీ భూకంపం..!

రాజధాని తైపీ(Taipei)లో భూకంపం కారణంగా పలు భవనాలు కంపించాయి. 24.9 కి.మీ లోతులో భూకంపం సంభవించినట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది.

by Mano
Taiwan: Trembling Taiwan.. once again a huge earthquake..!

తైవాన్‌(Taiwan)ను వరుస భూకంపాలు హడలెత్తిస్తున్నాయి. తాజా మరోసారి భారీ భూకంపం(Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రత చూపినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాజధాని తైపీ(Taipei)లో భూకంపం కారణంగా పలు భవనాలు కంపించాయి. 24.9 కి.మీ లోతులో భూకంపం సంభవించినట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది.

Taiwan: Trembling Taiwan.. once again a huge earthquake..!

ఎంత నష్టం జరిగిందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. తైవాన్‌లోని తూర్పు కౌంటీ హువాలియన్‌కు సమీపంలో భూమి కంపించినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల ప్రారంభంలోనూ హువాలియన్‌(Eastern County Hualien)లో 7.2తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి 17 మంది మృతిచెందారు. పెద్దఎత్తున ఇళ్లు ధ్వంసమయ్యాయి.

మరికొన్ని బీటలు వారాయి. అయితే ఇంతవరకు ప్రాణ నష్టానికి సంబంధించిన ఎలాంటి సమాచారం లేదు. ఆస్తి నష్టం మాత్రమే జరిగినట్లుగా అధికారులు చెబుతున్నారు. తైవాన్‌లో భూకంపాలు సంభవించడం కొత్తేమీ కాదు. 2016లో కూడా దక్షిణ తైవాన్‌లో భూకంపం వచ్చి 100కి పైగా ప్రజలు మృతిచెందారు. 1999లో 7.3 తీవ్రతతో భూకంపం వచ్చి దాదాపు 2వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇక ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో వచ్చిన భూకంపంతో 17మంది మృతిచెందారు. తైవాన్‌ ఒక అందమైన ప్రదేశాలున్నద్వీపం. ఈ దేశానికి పర్యాటకులు ఎక్కువగా వెళ్తుంటారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలతో తక్కువ జనాభా కలిగిన తూర్పు తీరం వెంబడి ఉన్న ప్రాంతంలో ఉన్న కఠిన పర్వతాలు, హాట్ స్ప్రింగ్ రిసార్ట్ లు, ప్రశాంతమైన పొలాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

You may also like

Leave a Comment