రాష్ట్ర ప్రజలను ఆకర్షించిందో, లేక బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతో.. మొత్తానికి కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. అయితే ఎన్నికల ముందు నుంచి గులాబీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ సమయంలో హస్తానికి అధికారాన్ని కట్టబెట్టాలని జనం అనుకుంటున్నట్టు వార్తలు సైతం వ్యాపించాయి.. అయితే ముందు వెనక ఆలోచించకుండా.. కాంగ్రెస్ అడ్డమైన హామీలు ఇచ్చిందని ఆరోపణలు మొదలైయ్యాయి.
ఈ క్రమంలో బీఆర్ఎస్ (BRS)లోని ముఖ్య నేతలు, కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై బహిరంగంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.. బీజేపీ నేతలు సైతం వీటి విషయంలో ఒత్తిడి పెంచుతోన్నట్టు కనిపిస్తుంది. తాజాగా బండి సంజయ్ (Bandi Sanjay).. ప్రభుత్వ పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను (Six guarantees) అమలు చేస్తామని ఇచ్చిన హామీపై కాంగ్రెస్ (Congress) కాలయాపన చేస్తోందని మండిపడ్డారు..
షెడ్యూల్ ప్రకారం చూస్తే మార్చి, ఏప్రిల్ లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. అంతకంటే ముందే ఎన్నికల కోడ్ వచ్చే అవకాశముంది. ఈ విషయం తెలిసి కూడా దరఖాస్తుల కంప్యూటరీకరణ, క్షేత్రస్థాయి పరిశీలన పేరుతో ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు.. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా, రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ నియోజకవర్గంలో పర్యటించిన బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని ఎలా గట్టెక్కిస్తారని, డబ్బులు లేని స్థితిలో ఉన్నప్పుడు ఆరు గ్యారంటీలను ఎలా అమలు చేస్తారని బండి ప్రశ్నించారు. ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పులపై శ్వేత పత్రాన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 6 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిన విషయం తెలిసిన తర్వాత, అమలుకు సాధ్యం కానీ హామీలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.