కాంగ్రెస్ (Congress).. బీఆర్ఎస్ (BRS) తెలంగాణ (Telangana)లో ప్రధాన పార్టీలుగా మారాయని అనుకుంటున్నారు ఓటర్లు.. ఈ ఎన్నికల్లో బీజేపీ (BJP) గట్టి పోటీ ఇస్తుందని భావించిన వారు సైతం ఆశ్చర్యపోయేలా కాంగ్రెస్ చంద్రయాన్ లా దూసుకెళ్లిందని అనుకుంటున్నారు. హస్తం అంతమైందని పార్టీ వీడిన వారు సైతం తిరిగి కాంగ్రెస్ లో చేరడంతో ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్వ వైభవం తెచ్చుకుంటుందా? అనే ఆసక్తి మొదలైంది.
ఇదిలా ఉండగా ఎప్పుడు మాట్లాడిన ఏదో ఒక ప్రత్యేకతని ప్రదర్శించే ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ (Bandla Ganesh)..కాంగ్రెస్ పై తనకు ఉన్న అభిమానాన్ని చాటారు.. తెలంగాణలో కాంగ్రెస్ ని గెలిపించాలని ప్రజలు డిసైడ్ అయ్యారన్న బండ్ల.. తెలంగాణ అంతా నవంబర్ 30 కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. సోనియాగాంధీ ఆశీస్సులతో, రాహుల్ గాంధీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి రాకెట్ మాదిరిగా దూసుకు వస్తున్నారన్నారు.
దేశం కోసం త్యాగాలు చేసింది ఎవరు..? తెలంగాణ ఇచ్చింది ఎవరు? అనే విషయాన్ని ప్రజలు గమనించాలని బండ్ల గణేష్ కోరారు. దేశం కోసం ముక్కలైన రాజీవ్ గాంధీ డెడ్ బాడీని వెతుక్కుంటూ రాహుల్ వెళ్ళడం గుర్తుకు వస్తే.. మనస్సు తొలిచివేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు పడితే వారు రాహుల్ గాంధీని (Rahul Gandhi) విమర్శించడానికి ఆయన కరప్షన్ కింగ్ కాదని.. త్యాగాల వంశంలో పుట్టిన నవాబ్ అని అన్నారు..
నవంబర్ 30న జరగబోయే మహా కురుక్షేత్రంలో ఓటరు దేవుళ్ళు అహంకారం తలకెక్కిన వారందరికి తగిన బుద్ధి చెబుతారని బండ్ల గణేష్ తెలిపారు. రాష్ట్రానికి ముఖ్య మంత్రి ఎవరన్నది తనకి ముఖ్యం కాదు.. కాంగ్రెస్ అధికారంలోకి రావడమే తన లక్ష్యం అని గణేష్ పేర్కొన్నారు.