Telugu News » Bandla Ganesh: ఈ రాత్రికి ఎల్బీ స్టేడియంలోనే నిద్రపోతా…!!

Bandla Ganesh: ఈ రాత్రికి ఎల్బీ స్టేడియంలోనే నిద్రపోతా…!!

రేపు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న తరుణంలో బుధవారం ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన ఆయన మీడియాతో పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

by Mano
Bandla Ganesh: Will sleep at LB Stadium tonight...!!

ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్(Bandla Ganesh) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తనకు ముందే తెలుసనీ… ఈ రాత్రికి తాను ఎల్బీ స్టేడియం(LB Stadium) లోనే నిద్రపోతానని ఆయన తెలిపారు.

Bandla Ganesh: Will sleep at LB Stadium tonight...!!

రేపు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న తరుణంలో బుధవారం ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన ఆయన మీడియాతో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 9న రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని నేను 7వ తేదీననే ఎల్బీ స్టేడియంలో ఉండిపోతానని గతంలో చెప్పారు.

కాగా, మూడు రోజుల ముందుగానే సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేస్తుండగా తాను ఇవాళ రాత్రి నుంచి ఎల్బీ స్టేడియంలోనే నిద్రపోతానని తెలిపారు. 200 పర్సెంట్ ఈ రాత్రికి తాను స్టేడియంలోనే ఉంటానని బండ్ల గణేష్ స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డి సీఎం కావడం తనకు ఎంతో సంతోషంగా ఉందనీ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి చాలా కష్టపడ్డారని తెలిపారు. తెలంగాణ ప్రజలకు మంచి రోజులు వచ్చాయని, తనకు ఎలాంటి పదవులు అక్కర్లేదని చెప్పారు. కేవలం పార్టీ కోసం పని చేశానని పేర్కొన్నారు.

You may also like

Leave a Comment