Telugu News » CM KCR : బతుకమ్మ సంస్కృతి, సంప్రదాయాల ఔన్నత్యాన్ని విశ్వ వ్యాప్తంగా చాటుతోంది.. సీఎం కేసీఆర్..

CM KCR : బతుకమ్మ సంస్కృతి, సంప్రదాయాల ఔన్నత్యాన్ని విశ్వ వ్యాప్తంగా చాటుతోంది.. సీఎం కేసీఆర్..

ప్రకృతితో మమేకమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ఔన్నత్యాన్ని విశ్వ వ్యాప్తంగా బతుకమ్మ పండుగ చాటుతుందని సీఎం వెల్లడించారు.. తెలంగాణ ప్రజలందరి బతుకుల్లో వెలుగులు నింపుతూ, మరింతగా సుఖ సంతోషాలతో ప్రజలు జీవించేలా దీవించాలని ప్రకృతిమాతను ప్రార్థించినట్టు సీఎం తెలిపారు.

by Venu
KCR To Hold Cabinet Meeting On Dec 4th

తెలంగాణ (Telangana) రాష్ట్ర పండుగ బతుకమ్మ (Bathukamma) ఉత్సవాలను (Festival) రాష్ట్ర ఆడపడుచులు ఘనంగా నిర్వహించుకొంటున్నారు. ఈ నేపధ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR) శుభాకాంక్షలు తెలిపారు. పుట్టింటికి చేరిన ఆడబిడ్డలు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి, ఆడుతూ పాడుతూ ఆనందోత్సాహాల నడుమ జరుపుకొనే బతుకమ్మ వేడుకలు, పల్లెల్లో ప్రత్యేకతను చాటుతాయని అన్నారు.

ప్రకృతిని ఆరాధిస్తూ, తొమ్మిది రోజుల పాటు (Nine Days) సాగే ఉత్సవాల సందర్భంగా, రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక సంబురం గొప్పగా వెల్లివిరుస్తుందని సీఎం తెలిపారు. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మ వరకు ఘనంగా నిర్వహించుకొనే వేడుక బతుకమ్మ అని, తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలంతా ఆటా పాటలతో కోలాట చప్పట్లతో కలిసికట్టుగా జరుపుకునే బతుకమ్మ సంబురాలతో, తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక పండుగ శోభ సంతరించుకుంటుందని సీఎం అన్నారు.

ప్రకృతితో మమేకమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ఔన్నత్యాన్ని విశ్వ వ్యాప్తంగా బతుకమ్మ పండుగ చాటుతుందని సీఎం వెల్లడించారు.. తెలంగాణ ప్రజలందరి బతుకుల్లో వెలుగులు నింపుతూ, మరింతగా సుఖ సంతోషాలతో ప్రజలు జీవించేలా దీవించాలని ప్రకృతిమాతను ప్రార్థించినట్టు సీఎం తెలిపారు.

You may also like

Leave a Comment