Telugu News » Bengaluru Cafe Blast: బెంగళూరు కేఫ్ పేలుడు.. శత్రుదేశం పనేనా..?

Bengaluru Cafe Blast: బెంగళూరు కేఫ్ పేలుడు.. శత్రుదేశం పనేనా..?

ఈ నేపథ్యంలో వారి నుంచి కీలకమైన అంశాలపై ఆరాతీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శత్రుదేశం పాకిస్థాన్(Pakistan) ప్రమేయంపై ఆరాతీస్తున్నట్లు తెలుస్తోంది.

by Mano
Bengaluru Cafe Blast: Is the Bengaluru Cafe Blast an enemy's act..?

బెంగళూరు కేఫ్‌(Bengaluru Café)లో జరిగిన పేలుడు ఘటనలో ఇద్దరు నిందితులను ఎన్ఐఏ(NIA) అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి నుంచి కీలకమైన అంశాలపై ఆరాతీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శత్రుదేశం పాకిస్థాన్(Pakistan) ప్రమేయంపై ఆరాతీస్తున్నట్లు తెలుస్తోంది.

 Bengaluru Cafe Blast: Is the Bengaluru Cafe Blast an enemy's act..?

గతేడాది అక్టోబరులో ఢిల్లీలో ఐఎస్ఐకు సంబంధించిన ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేయడం ద్వారా దర్యాప్తు బృందం కీలక విషయాన్ని రాబట్టింది. ఐఎస్ఐ(ISI) గతంలో ఐఎస్ కార్యకర్తలుగా ఉంటూ భారత్‌లో టెర్రర్ మాడ్యూల్‌ను విస్తరించినట్లు గుర్తించారు. వీరికి డబ్బులను క్రిప్టో- వాలెట్ల ద్వారా పంపడంతో పాటు సౌత్ ఇండియాలో యువకులను మతపరమైన అంశాలతో ప్రేరేపిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.

అదేవిధంగా రద్దీగా ఉండే ప్రదేశాల్లో దాడులు చేయడంలో అబ్దుల్ మతిన్ తాహా కీలక పాత్ర పోషిస్తున్నాడని దర్యాప్తు ఏజెన్సీకి చెందిన ఒక అధికారి తెలిపారు. అదే మాదిరిగా బెంగళూరు పేలుడుకు సంబంధించి దర్యాప్తులో భాగంగా ‘కల్నల్’ అనే పేరు వ్యక్తిది కాదని, అది ఒక కోడ్ నేమ్ అని దర్యాప్తు బృందం నిర్ధారణకు వచ్చింది. ఈ ఉగ్రవాది (కల్నల్)కి శత్రుదేశం పాకిస్థాన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐతో సంబంధాలు ఉండవచ్చని దర్యాప్తు సంస్థ అనుమానం వ్యక్తం చేసింది.

అంతేకాదు.. చిన్న చిన్న మాడ్యూళ్లను రూపొందించడం ద్వారా ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) గ్రూపు ఉగ్రవాద కార్యకలాపాలను పునరుద్ధరించడంలో పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ సహకారాన్ని తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. ఈ కేసులో కీలక సూత్రదారిగా ఆరోపించిన అబ్దుల్ మతిన్ తాహా, ముసావిర్ హుస్సేన్ షాజీబ్లో సంప్రదింపులు జరుపుతున్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.

You may also like

Leave a Comment