Telugu News » మాట వినని టమాటాతో మనకెందుకు.. ఇవి ట్రై చేస్తే సరి..!

మాట వినని టమాటాతో మనకెందుకు.. ఇవి ట్రై చేస్తే సరి..!

by admin
Best Substitutes for Tomatoes

ఏంకొనేటట్లు లేదు..ఏం తినేటట్లు లేదు నాగులో నాగన్న టమాటాల రేటు చూడ నాగులో నాగన్న, నాగు పాము బుసలు కొట్టే నాగులో నాగన్న.. ఇది రేట్లకోసం‘ఎర్రోడు’ సినిమాలోని ఆర్ నారాయణ మూర్తి పాట. రేటు మరీ ఎర్రబడిందని మణిపూర్ లా మండిపోతుందని టమాటాపై ఇలాగే పేరడీ చెయ్యాల్సి వచ్చింది.

Best Substitutes for Tomatoes

మనలోమన మాట.. టమాటా రేటు ఏదో దిగుతుందని ఎదరు చూసి మోసపోయే కంటే.. అందుబాటులోని వివిధ ప్రత్యామ్నాయాలలో టమాటాను చూసుకుంటే మేలు కదా. మొక్కవోని మొండి తనంతో చెట్టెక్కి కూర్చున్న టమాటాకు ప్ర‌త్యామ్నాయ మార్గాలు లేకపోలేదు. ఎటొచ్చి నాలుకకి కాస్త సర్దిచెప్పుకోవాలంతే.

ట‌మాటా ధ‌ర కిలో రూ.150 దాటింది మరి. సామాన్యుడు కొనలేని పరిస్థితి ఉంది. దీనికి ప్ర‌త్యామ్నాయాలు అనేకం. ఉసిరి పొడి టమాటా లాగే కూరలకు పులుపు తగిలిస్తుంది. బదులుగా ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది.

ఉసిరి పొడి ఇష్టం లేకపోతే పోని అందుబాటులో లేకపోతే టమాటాకి బదులుగా వంటల్లో చింతపండును వాడొచ్చు. కూరలకు పులుపు దనం ఇవ్వడంతో పాటు చిక్కగా ఉండేలా చేస్తుంది. ఇది అమ్మమ్మల కాలం నుంచి సగటు గృహిణి పిండిపోస్తున్న చింత పండు రసాయనం.

చింత చిరాకనిపిస్తే వెనిగర్ కూడా టమాటా లాగే పులుపును, మంచి వాస‌న‌ను ఇస్తుంది. పుల్లని మామిడి కూడా అద్భుతమైన ప్రత్యామ్నాయం. అయితే.. సీజన్ కాకపోతే టమాటా కంటే ఎక్కువ ఫోజు కొడుతుంది. ఇవన్నీ వాడితే రుచి సరే.. రంగు ఎక్కడ నుంచి వస్తుంది అనే క్వశ్చనొస్తుంది. ఆ రంగు కొసం బెల్ పెప్పర్ వాడొచ్చు. ఇదేదో వింత వెజిటబుల్ అని కంగారు పడకండి. క్యాప్సికమ్ అన్నమాట. మన ఊరిభాషలో చెప్పాలంటే బండ మిర్చి. కొండెక్కి కూర్చున్న టమాటా మీద కసితోనైనా ఇవి ట్రైచేసి చూడండి.

You may also like

Leave a Comment