Telugu News » Bharat Vs Pak: భారత్ దెబ్బకు..పాక్‌ చిత్తు!

Bharat Vs Pak: భారత్ దెబ్బకు..పాక్‌ చిత్తు!

ఆసియా కప్‌ లో పాక్‌ ని భారత్‌ అంతలా బెదరగొట్టేసింది.

by Sai

సోమవారం భారత్‌(Bharat) పాక్ (Pak) మధ్య జరిగిన మ్యాచ్ (Match) గురించి తలచుకోవాలంటేనే పాక్‌ కు వెన్నులో వణుకుపుడుతుంది. ఆసియా కప్‌ లో పాక్‌ ని భారత్‌ అంతలా బెదరగొట్టేసింది. భారత్‌ బ్యాటర్లు, బౌలర్ల దెబ్బకు అటు వరుణుడు కూడా జడుసుకుని పారిపోయాడు. కోహ్లీకి(Kohli) బాగా కలిసొచ్చిన మైదానం కావడంతో విరాట్‌ 94 బంతుల్లోనే 122 పరుగులు చేసి నాటౌట్‌ గా నిలిచాడు.

bharat vs pak super 4 match highlights and latest records in asia cup

కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) ఆటతీరు గురించి మాట్లాడిన వారందరికీ రాహుల్‌ బ్యాట్‌ తో సమాధానం చెప్పాడు. కేవలం 100 బంతుల్లో 100 బాది(Century) తను కూడా నాటౌట్‌ గా నిలిచాడు..అటు విరాట్‌..ఇటు రాహుల్‌ క్రీజులో చేలరెగి పోయారు. ఇప్పటి వరకు తన మీద ఉన్న అనుమానలన్నింటిని బౌండరీ అవతల పడేటట్లు చేశాడు.

ఇక ఈ మ్యాచ్‌ లో ప్రత్యర్థులకు చుక్కలు చూపించింది అంటే కుల్దీప్ యాదవ్‌ అని చెప్పుకొవచ్చు.25 బంతులకు 5 వికెట్లు తీసి దాయాదుల గుండెల్లో నిద్రపోయాడు. మొత్తానికి వీరందరి కృషి ఫలితంగా ఆసియాకప్‌ సూపర్‌-4లో కోట్లాది అభిమానులను ఆనందంలో ముంచుతూ రోహిత్‌ సేన 228 రన్స్‌ తేడాతో భారీ విజయం అందుకుంది.

సోమవారం పూర్తయిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 50 ఓవర్లలో 2 వికెట్లకు 356 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేదనలో పాక్‌ 32 ఓవర్లలో 8 వికెట్లకు 128 పరుగులు చేసింది. పేసర్లు నసీమ్‌, హరీస్‌ రౌఫ్‌ గాయాలతో బ్యాటింగ్‌కు దిగలేదు. ఫఖర్‌ జమాన్‌ (27) టాప్‌ స్కోరర్‌. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా విరాట్‌ కోహ్లీ నిలిచాడు. రెండో రోజు వర్షం కారణంగా మ్యాచ్‌ రెండు గంటలు ఆలస్యంగా ఆరంభమైంది.

ఓ వైపు భారీ ఛేదన కనిపిస్తున్నా.. పాక్‌ ఆటతీరు నిస్సారంగా సాగింది. భారత బ్యాటర్లు అలవోకగా చెలరేగిన పిచ్‌పై వీరు ఒక్కో పరుగు తీసేందుకు అష్టకష్టాలు పడ్డారు. దీనికితోడు పేసర్‌ బుమ్రా పదునైన బంతులతో వణికించగా.. మధ్య ఓవర్లలో స్పిన్నర్‌ కుల్దీప్‌ పాక్‌ పనిబట్టాడు. ఐదో ఓవర్‌లోనే బుమ్రా ఓపెనర్‌ ఇమామ్‌ (9) వికెట్‌ను తీయగా.. జాగ్రత్తగా ఆడిన కెప్టెన్‌ బాబర్‌ (10)ను హార్దిక్‌ క్లీన్‌బౌల్డ్‌ చేయడంతో 44 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.

అయితే 11 ఓవర్లు ముగిశాక భారీ వర్షంతో గంటపాటు ఆట ఆగింది. మ్యాచ్‌ ప్రారంభమైన వెంటనే రిజ్వాన్‌ (2)ను శార్దూల్‌ అవుట్‌ చేశాడు. ఇక ఆ తర్వాత స్పిన్నర్‌ కుల్దీప్‌ మాయ చేశాడు. అతడి బంతులను ఎదుర్కోలేక ఓపెనర్‌ ఫఖర్‌తో పాటు ఆఘా సల్మాన్‌ (23), షాదాబ్‌ (6), ఇఫ్తికార్‌ (23), ఫహీమ్‌ (4) వరుసగా అవుట్‌ చేయడంతో పాక్‌ ఇన్నింగ్స్‌ 32 ఓవర్లలోనే ముగిసింది.

పాకిస్థాన్‌పై అత్యధిక పరుగుల (228) తేడాతో గెలవడం భారత్‌కిదే తొలిసారి. ఆసియాక్‌ప చరిత్రలో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం (233) అందించిన జోడీగా రాహుల్‌-కోహ్లీ. ఇక, ఓవరాల్‌గా భారత్‌-పాక్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో అత్యధిక స్కోరు (356) సమం. గతంలో వైజాగ్‌లో భారత్‌ ఇంతే స్కోరు చేసింది. వన్డేల్లో అత్యంత వేగం (267 ఇన్నింగ్స్‌లో)గా 13 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా కోహ్లీ. అలాగే ఒకే వేదిక (కొలంబోలో 4)పై వరుసగా అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడయ్యాడు. ఆమ్లా సెంచూరియన్‌లో కూడా ఇన్నే శతకాలు నమోదు చేశాడు. ఆసియాక్‌పలో ఎక్కువ సెంచరీలు (4) చేసిన రెండో బ్యాటర్‌గా విరాట్‌. జయసూర్య (6) ముందున్నాడు.భారత్‌ నుంచి మూడు, నాలుగో నెంబర్‌ బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇది మూడోసారి.

You may also like

Leave a Comment