Telugu News » Mind blowing technology : బాస్ జరభద్రం.!మీ బుర్రలో మేటర్ మాయం.!!

Mind blowing technology : బాస్ జరభద్రం.!మీ బుర్రలో మేటర్ మాయం.!!

మన బ్యాంక్ అకౌంట్లో డబ్బుల్ని దోచేసే సైబర్ చోరులను గురించి చదివాం. సెల్ ఫోన్లో డేటా దోచ వాళ్ల గురించి విన్నాం.

by sai krishna

మన బ్యాంక్ అకౌంట్లో డబ్బుల్ని దోచేసే సైబర్ చోరులను గురించి చదివాం. సెల్ ఫోన్లో డేటా దోచ వాళ్ల గురించి విన్నాం.బుర్ర తినేస్తున్నాడ్రా బాబు.. అనుకోకపోతే.. ఒక మాట.! మనకు తెలియకుండా బుర్రలో డేటా దోచుకుపోయే టెక్నాలజీ వచ్చేసిందంట.బుర్రపోగొట్టుకున్నోడికి నిజం..వింటున్న మనకు అబద్ధం.!

ఏఐ తోనే వేగలేకపోతున్నాంరా అనుకుంటే..మైండ్ కంట్రోల్ టెక్నాలజీ కూడా వచ్చేసి అమెరికా వాళ్లకి మెంటలెక్కిస్తుందట. పూర్వకాలం చేతబడి చేసి పగోణ్ణి హింసించినట్టు మైండ్ కంట్రోల్ టెక్నాలజీతో డేటా మనిషిని కంట్రోల్ చేసుకుంటున్నారట.


ఈ టెన్నాలజీ మానవ మెదడును కంట్రోల్ చేసే టెక్నాలజీ పరిశోధనలతో ప్రమాదం పొంచి ఉంటుందని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఎన్నారై తరుణ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మానవుల ఆలోచనలను చదివి మానవ మెదడులను ప్రభావితం చేసే టెక్నాలజినీ కొన్ని గుర్తు తెలియని సంస్థలు అభివృద్ధి చేసి మనుషులను గిన్ని పిగ్స్ వలె(Guinea pigs) ఉపయోగించుకుంటున్నారని NRI రావి తరుణ్ ఆరోపించారు.

 

అయితే.. వినటానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఇది వాస్తవమని అన్నారు తరుణ్. మనుషుల ఆలోచనలను చదివటం దగ్గర నుంచి మానవుల ఆలోచనలను దారి మళ్ళించే విధంగా పరిశోధనలు చేస్తూ గిన్ని పిగ్స్ గా వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తనలాగే వైజాగ్ లో ఓ వ్యక్తిని టార్గెట్ చేశారని దీంతో అతను ఆ భాదలు భరించలేక అమెరికా వదిలి వైజాగ్ వచ్చేశారని తెలిపారు. మూడు నెలల క్రితం హవానా సిండ్రోమ్(Havana syndrome)వివరాలు తెలపాలంటూ కర్ణాటక హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిందని అన్నారు.

ఉదాహరణకు ఏదైనా ప్యాంట్, షర్టు గురించి గూగుల్ లో వెతికితే వెంటనే దానికి సంబంధించిన వివరాలు మొత్తం మొబైల్లో ప్రత్యక్షమవుతాయని అంతేకాకుండా అనేక కంపెనీల నుంచి తమ ప్రోడక్ట్ కొనమంటూ మెసేజ్ లు వస్తాయని ఆ విషయాలు ఆయా కంపెనీలకు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు.


అంటే.. మన డీటెయిల్స్ ని మనం వెతికిన సంస్థ లేదా ఆ సాఫ్ట్‌ వేర్‌(Software) ఫలానా వ్యక్తి షర్టు, ప్యాంట్లు కావాలని అడుగుతున్నారని మిగిలిన కంపెనీలకు పంపిస్తాయని అన్నారు. అంటే మన వివరాలను అమ్మేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు తరుణ్..ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసిన సైంటిస్టులు బహిరంగంగా చేసిన పరిశోధనల పట్ల విచారణ వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

1953లో అమెరికా ఎంకే ఆల్ట్రా పేరుతో ఈ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారని ఆ పరిశోధనల ఫలితమే ఈ న్యూరో వెపన్స్(Neuroweapons), ఎనర్జీ వెపన్స్(Energy Weapons) అని అన్నారు.

ఈ వెపన్స్ మానవ మెదళ్లను ప్రభావితం చేస్తాయని తద్వారా ఆలోచనలను తెలుసుకొనటమే కాకుండా మనిషిలో అనేక రకమైన బాధలను కలిగిస్తాయని, దీనినే హావానా సిండ్రోం అంటారని చెప్తున్నారు.

హావాన సిండ్రోం బారిన పడిన వారిలో అనేకమంది ప్రఖ్యాతి చెందిన సైంటిస్టులు డాక్టర్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారని వారిలో అమెరికాకు చెందిన ప్రముఖ రాజకీయవేత్త కమల్ హారిస్ ఉన్నారని, డాక్టర్ లెన్ బెర్, డాక్టర్ రాబర్ట్ డంకన్, డాక్టర్ కేథరీన్ హోర్టన్, డాక్టర్ జాన్ హాల్ ఉన్నరని అన్నారు.

You may also like

Leave a Comment