పార్లమెంట్ (Parliament)లో ఎంపీల సస్పెన్షన్‌కు నిరసనగా శుక్రవారం ఇందిరా పార్క్ (Indira Park) వద్ద కాంగ్రెస్ (Congress) ధర్నా నిర్వహించిన విషయ తెలిసిందే.. ఎంపీల సస్పెండ్‌ను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు నిరసనలు చేపట్టారు. ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేసి, పార్లమెంట్ దాడిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కీలక వ్యాఖ్యలు చేశారు..
కేంద్ర హోంమంత్రి, ప్రధాని మోడీ (Modi) పార్లమెంటుపై దాడి జరిగితే ఒక్క ప్రకటన కూడా చేయలేదని భట్టి మండిపడ్డారు. ప్రజా ప్రతినిధులకు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే స్పేచ్ఛ కూడా లేకపోవడం ఆందోళనకరం అని తెలిపారు. ప్రధాని మోడీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని భట్టి విక్రమార్క ఆరోపించారు. అనేకమంది త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యం వచ్చిన దేశంలో.. ఇప్పుడు అరాచక పాలన సాగుతుందని విరుచుకుపడ్డారు.
పార్లమెంట్‌పై దాడి అంటే దేశంపై జరిగినట్లే అని భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) పేర్కొన్నారు.. దేశంలో 146 మంది ఎంపీల సస్పెన్షన్ సిగ్గుచేటని దుయ్యబట్టారు.. బీజేపీ (BJP) ప్రభుత్వం దేశ రక్షణను గాలికి వొదిలేసిందని భట్టి విమర్శించారు. ఈ అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) సైతం స్పందించారు. మోదీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు.
బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఈడీ, ఐటీ దాడులు చేస్తున్నారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కాగా మంత్రి జూపల్లి కృష్ణరావు సైతం కీలక వ్యాఖ్యలు చేశారు.. మతాల పేరుతో బీజేపీ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుందని ఆరోపించారు.. ఎంపీలను సస్పెండ్ చేసినట్లు, రాబోయే రోజుల్లో బీజేపీని కూడా ప్రజలు సస్పెండ్ చేస్తారని అన్నారు. బీజేపీ నియంతృత్వంగా వ్యవహరిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar) అన్నారు. పార్లమెంటుకే భద్రత ఇవ్వలేనోళ్లు దేశానికి భద్రత ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
పార్లమెంట్లో దాడి ఏంటని ప్రశ్నించినందుకు, ఎంపీలను సస్పెండ్ చేయడం సరికాదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni) వ్యాఖ్యానించారు. కేంద్రంలో బీజేపీ పాలన ఎక్కువ కాలం కొనసాగదని జోస్యం చెప్పారు. దాడిపై అసలు విషయం ఏంటో బయటకు రావాలని కూనంనేని డిమాండ్ చేశారు.