తెలంగాణ రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి(Minister Bhatti Vikramarka) తెలిపారు. మూడోరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఫీజు రీ ఎంబర్స్మెంట్(Fee Reimbursement)పై కాంగ్రెస్ సర్కారు కీలక ప్రకటన చేశారు.
విద్యారంగానికి ఈ బడ్జెట్ లో రూ.21,389 కోట్లను ప్రతిపాదిస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ప్రారంభించిన పథకాన్ని తమ ప్రభుత్వం మళ్లీ పకడ్భందీగా ముందుకు తీసుకెళ్లేందుకు కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బాలబాలికలకు ప్రస్తుత స్కాలర్షిప్లను సకాలంలో అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
గత ప్రభుత్వం ఫీజు రీ ఎంబర్స్మెంట్ నిధులను సరైన సమయంలో విడుదల చేయకపోవడంతో ఎంతోమంది విద్యార్థులు తమ చదువు పూర్తయి కూడా ఉత్తీర్ణత సర్టిఫికెట్లు పొందలేక విలువైన అవకాశాలు చేజార్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి మండలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
హైదరాబాద్ మెడలో అందమైన హారంలా మూసీ నదిని తీర్చిదిద్దుతామని చెప్పారు భట్టి. బడ్జెట్లో మూసీ అభివృద్ధికి రూ.1000కోట్లు ప్రతిపాదించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంటు ప్రాజెక్టులో భాగంగా పాదచారుల జోన్లు, పీపుల్స్ ప్లాజాలు, ఓల్డ్ సిటీలోని హెరిటేజ్ జోన్లు, హాకర్స్ జోన్లు, చిల్డ్రన్స్ థీమ్స్ పార్కులు, ఎంటర్టైన్మెంట్ జోన్లు అభివృద్ధి చేస్తామన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు పర్యాటక స్థలాలతో పోటీపడుతుందనడంతో ఎలాంటి సందేహం లేదన్నారు.