Telugu News » Venugopala Krishna: పవన్ కల్యాణ్ ‘ఆశ’యం ఏంటో అర్థంకాదు: మంత్రి వేణుగోపాలకృష్ణ

Venugopala Krishna: పవన్ కల్యాణ్ ‘ఆశ’యం ఏంటో అర్థంకాదు: మంత్రి వేణుగోపాలకృష్ణ

పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఆశయం ఏంటనేది ఎవరికీ అర్థం కాదని మంత్రి వేణుగోపాలకృష్ణ(Minister Venugopala Krishna) విమర్శించారు. ఆయన స్థాపించిన ‘జనసేన’ పార్టీ ఆశయం ఎక్కడా కనిపించడంలేదన్నారు. పవన్ కల్యాణ్ ఏ ఆశతో పార్టీ పెట్టారో.. ఏ ఆశయం కోసం పెట్టారో తేల్చి చెప్పాలని వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు.

by Mano
Venugopala Krishna: Pawan Kalyan's 'wish' is not understood: Minister Venugopala Krishna

పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఆశయం ఏంటనేది ఎవరికీ అర్థం కాదని మంత్రి వేణుగోపాలకృష్ణ(Minister Venugopala Krishna) విమర్శించారు. తూర్పుగోదావరి(East Godavari)లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పవన్ ఒకసారి బీజేపీతో పొత్తు అంటూనే ఇప్పుడు టీడీపీతో కలిసి తిరుగుతున్నారంటూ ఎద్దేవా చేశారు.

Venugopala Krishna: Pawan Kalyan's 'wish' is not understood: Minister Venugopala Krishna

ఆయన స్థాపించిన ‘జనసేన’ పార్టీ ఆశయం ఎక్కడా కనిపించడంలేదన్నారు. పవన్ కల్యాణ్ ఏ ఆశతో పార్టీ పెట్టారో.. ఏ ఆశయం కోసం పెట్టారో తేల్చి చెప్పాలని వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్.. ప్రజలతో ప్రశ్నించుకునే స్థాయికి వెళ్లిపోయారంటూ సెటైర్లు వేశారు. ఆశయాలతో వచ్చిన పార్టీలనే ప్రజలు నమ్ముతారని హితవుపలికారు.

కాపు నేత ముద్రగడ కుటుంబాన్ని తీవ్రంగా హింసించిన చంద్రబాబుతోనే ఇప్పుడు పవన్ కలిసి వెళ్తున్నారని, చంద్రబాబు ఏనాడు రాష్ట్రంలో సంపద సృష్టించలేదని విమర్శించారు. స్వాతంత్రం కోసం పుట్టిన కాంగ్రెస్ పార్టీ అత్యాశకు పోయి కుప్పకూలిపోయిందన్నారు. మంచి ఆశయాలతో ప్రారంభమైన ఎన్టీఆర్ పార్టీని చంద్రబాబు నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభ దక్కించుకోవాలనే ఆశతో ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్‌లో విలీనం చేశారని దుయ్యబట్టారు.

తండ్రి ఆశయాల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రారంభించారని మంత్రి వేణుగోపాలకృష్ణ చెప్పుకొచ్చారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెట్, పెన్షన్, తండ్రి ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని విస్తృతం చేసి చూపించారంటూ ప్రశంసల జల్లు కురిపించారు. రాష్ట్రంలో పేదరికం 16శాతం నుంచి నాలుగు శాతానికి తగ్గిందన్నారు. రాష్ట్ర ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందని రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ సుబ్బారావు చెప్పారని గుర్తుచేశారు.

You may also like

Leave a Comment